SVVU Tirupati Recruitment: తిరుపతి వెంకటేశ్వర వెటర్నరీ యూనిర్సిటీలో ఉద్యోగాలు.. ల్యాబ్ టెక్నీషియన్స్ పోస్టుల భర్తీ..
SVVU Tirupati Recruitment: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ (ఎస్‌వీవీయూ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో భాగంగా...
SVVU Tirupati Recruitment: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ (ఎస్‌వీవీయూ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగులను తీసుకోనున్నారు.
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 15 ల్యాట్ టెక్నీషియన్ పోస్టులను భర్తీచేయనున్నారు.
* పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో డిప్లొమా (డీఎంఎల్‌టీ) ఉత్తీర్ణత సాధించాలి.
* జిల్లాల వారీ ఖాళీల విషయానికొస్తే.. విశాఖపట్నం (01), కడప (01), కృష్ణా (01), నెల్లూరు (02), శ్రీకాకుళం (01), విజయనగరం (01), తూర్పు గోదావరి (01), పశ్చిమ గోదావరి (02), గుంటూరు (01), ప్రకాశం (01), చిత్తూరు (01), అనంతపురం (01).
ముఖ్యమైన విషయాలు..
* దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ బీసీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తు ఫీజు రూ. 200గా నిర్ణయించారు.
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 21.05.2021న ప్రారంభమవుతుండగా.. 03.06.2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Blast in Pakistan: పాకిస్తాన్ లో పాలస్తీనా అనుకూల ర్యాలీలో భారీ పేలుడు.. 8 మంది మృతి!
Indian Railway: రైల్వేలో 3591ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ.. మే 25 నుంచి దరఖాస్తులు ప్రారంభం