AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక 9, 10 తరగతి విద్యార్ధులకు తెలుగు సబ్జెక్ట్‌ తప్పనిసరేం కాదు.. విద్యాశాఖ ఉత్తర్వులు

SSC మినహా మిగతా బోర్డులకు సంబంధించిన పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టు తప్పనిసరిగా అమలు చేయాలనే నిబంధనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. ఈ నిబంధనను కేవలం 8వ తరగతి వరకు మాత్రమే అమలు చేయాలని, 9, 10 తరగతులకు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది..

ఇక 9, 10 తరగతి విద్యార్ధులకు తెలుగు సబ్జెక్ట్‌ తప్పనిసరేం కాదు.. విద్యాశాఖ ఉత్తర్వులు
CBSE, ICSE Board schools
Srilakshmi C
|

Updated on: Dec 09, 2024 | 5:50 PM

Share

హైదరాబాద్‌, డిసెంబర్‌ 9: తెలంగాణ రాష్ట్రంలో సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ ఇతర బోర్డుల్లో 9, 10 తరగతులు చదివే విద్యార్థులకు రాష్ట్ర సర్కార్‌ కీలక అప్‌డేట్‌ జారీ చేసింది. ప్రస్తుత (2024-25), వచ్చే విద్యా సంవత్సరం (2025-26) తొమ్మిదవ, పదో తరగతి చదివే విద్యార్ధులు తెలుగును ఒక సబ్జెక్టుగా చదవడంపై మినహాయింపునిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 2018-19 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి వరకు పాఠశాల విద్యార్ధులు తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేస్తూ చట్టం చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ చట్టం సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ ఇతర బోర్డుల్లో 1 నుంచి 8వ తరగతి వరకు మాత్రమే అమలు చేస్తున్నారు. 9, 10 తరగతుల విద్యార్ధులు చదవడం లేదు. కేవలం ఐదు సబ్జెక్టులే చదువుతున్నారు. భాషా సబ్జెక్టుల్లో ఆంగ్లం, హిందీ మాత్రమే వీరంతా అభ్యసిస్తున్నారు. ఇతర బోర్డుల్లో తెలుగు మాతృభాష కానివారు కూడా అధిక సంఖ్యలో ఉండటమే ఇందుకు కారణం. దీంతో ఆ సబ్జెక్టులో తప్పనిసరిగా పాస్‌ కావాలంటే ఇబ్బందులు వస్తాయని భావించిన విద్యాశాఖ 2024-25, 2025-26 విద్యా సంవత్సరాలకు అమలును మినహాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్వల్ప మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

క్లాట్‌ 2025 ర్యాంకు కార్డులు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌) 2025 ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. పరీక్ష రాసిన అభ్యర్థులు అప్లికేషన్‌ లేదా అడ్మిట్‌ కార్డు నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి స్కోరు కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా 141 పరీక్ష కేంద్రాల్లో డిసెంబర్‌ 1వ తేదీన క్లాట్ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలు డిసెంబర్ 9న అందుబాటులో రానున్నాయి. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా నేషనల్‌ లా స్కూల్స్, యూనివర్సిటీల్లో యూజీ, పీజీ డిగ్రీ ప్రోగ్రాలలో (ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం) ప్రవేశాలు కల్పిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 24 ప్రధాన లా యూనివర్సిటీలు ఇందులో పాల్గొంటున్నాయి. కాగా ఆలిండియా స్థాయిలో ఏటా కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌)ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో మెరుగైన ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సులు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో చదివేందుకు అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

క్లాట్‌ 2025 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు