AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGRTC: విద్యార్థులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్.. ఐటీఐ కోర్సులకు ఆహ్వానం

తెలంగాణ ఆర్టీసీ విద్యార్థులకు శుభవార్త తెలిపింది. తెలంగాణలోని పలు ఐటీఐ కళాశాలల్లో ట్రేడ్‌లలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. స్యయం ఉపాధి రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఈ అవకాశం బెస్ట్‌ ఆప్షన్‌గా చెబుతున్నారు. ఇంతకీ ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

TGRTC: విద్యార్థులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్.. ఐటీఐ కోర్సులకు ఆహ్వానం
TGRTC
Narender Vaitla
|

Updated on: May 27, 2024 | 6:19 PM

Share

తెలంగాణ ఆర్టీసీ విద్యార్థులకు శుభవార్త తెలిపింది. తెలంగాణలోని పలు ఐటీఐ కళాశాలల్లో ట్రేడ్‌లలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. స్యయం ఉపాధి రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఈ అవకాశం బెస్ట్‌ ఆప్షన్‌గా చెబుతున్నారు. ఇంతకీ ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

హైదరాబాద్‌, వరంగల్‌లోని ఐటీఐఈ కళాశాలల్లో వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తుల స్వీకరణకు జూన్‌ 10వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. తెలంగాణ ఐటీఐ అడ్మిషన్స్ 2024 దరఖాస్తు చేసుకోవడానికి, పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి. 

ఐటీఐలో భాగంగా మోటార్‌ మెకానిక్‌ వెహికిల్‌, మెకానిక్‌ డిజిల్‌, వెల్డర్‌, పెయింటర్‌ ట్రెడ్‌లలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. స్వయం ఉపాధి రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఐటీఐ కోర్సులు వరంలాంటివి. నిరుద్యోగ యువతకు చక్కటి శిక్షణ, బంగారు భవిష్యత్‌ అందించడంతో పాటు తక్కువ వ్యవధిలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఐటీఐ కళాశాలలను సంస్థ ఏర్పాటు చేసింది.

Tgrtc Iti

నిపుణులైన అధ్యాపకులతో పాటు అపార అనుభవంగల ఆర్టీసీ అధికారులతో తరగతులను నిర్వహిస్తోంది. ఈ ట్రేడ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు కోరుకున్న టీజీఎస్‌ఆర్టీసీ డిపోల్లో అప్రెంటీషిఫ్‌ సౌకర్యం కల్పిస్తారు. ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు హైదరాబాద్‌ ఐటీఐ కళాశాల ఫోన్‌ నంబర్లు 9100664452, 040-23450033, వరంగల్‌ ఐటీఐ కళాశాల ఫోన్‌ నంబర్లు 9849425319, 8008136611 ను సంప్రదించగలరు. పూర్తి వివరాలను https://iti.telangana.gov.in/ వెబ్‌సైట్‌లోనూ చూడొచ్చు

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
'నా మృతదేహం పక్కన తారక్‌తో సహా ఆ హీరోలందరూ'.. జగ్గూభాయ్ కామెంట్స్
'నా మృతదేహం పక్కన తారక్‌తో సహా ఆ హీరోలందరూ'.. జగ్గూభాయ్ కామెంట్స్
మామిడి పండ్లు తిన్న తర్వాత తీవ్ర అస్వస్థత.. కాసేపటికే దారుణం!
మామిడి పండ్లు తిన్న తర్వాత తీవ్ర అస్వస్థత.. కాసేపటికే దారుణం!
తొలకరి తాకిడికి తడిసిన నేల..ఆరుద్రల పరుగులతో మురిసిన పొలం!
తొలకరి తాకిడికి తడిసిన నేల..ఆరుద్రల పరుగులతో మురిసిన పొలం!
ఇంట్లో ఈవీ ఛార్జర్‌ను ఏర్పాటు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది?
ఇంట్లో ఈవీ ఛార్జర్‌ను ఏర్పాటు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది?
స్విట్జర్లాండ్ ఫుట్‌బాల్ జట్టు పై పగబట్టిన పాములు
స్విట్జర్లాండ్ ఫుట్‌బాల్ జట్టు పై పగబట్టిన పాములు
వాటర్ పంపుల వద్ద వింత శబ్ధాలు.. భయంతో వణికిన సిబ్బంది
వాటర్ పంపుల వద్ద వింత శబ్ధాలు.. భయంతో వణికిన సిబ్బంది
ప్యాంట్ జేబులో ఉండగా ఒక్కసారిగా పేలిపోయిన ఫోన్.. ఇదిగో వీడియో
ప్యాంట్ జేబులో ఉండగా ఒక్కసారిగా పేలిపోయిన ఫోన్.. ఇదిగో వీడియో
పాపం! జాన్వీని తిట్టొద్దు..ఆమె దర్శకుడు చెప్పిందే చేసింది
పాపం! జాన్వీని తిట్టొద్దు..ఆమె దర్శకుడు చెప్పిందే చేసింది
'పరభాషా నటులతో పోల్చితే అనుకున్నంత గుర్తింపు రావడం లేదు
'పరభాషా నటులతో పోల్చితే అనుకున్నంత గుర్తింపు రావడం లేదు
సరికొత్త మైలురాయి.. భావోద్వేగానికి గురైన ప్రధాని మోదీ..!
సరికొత్త మైలురాయి.. భావోద్వేగానికి గురైన ప్రధాని మోదీ..!