AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGPSC Group 3 Notification: నిరుద్యోగులకు సీఎం రేవంత్‌ శుభవార్త.. టీజీపీఎస్సీ గ్రూప్‌ 3 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్‌

గ్రూప్‌ 1లోని అభ్యర్థులు గ్రూప్‌ 2లోనూ ఎంపికయ్యారని అన్నారు. గ్రూప్‌ 2లో తదుపరి ర్యాంకులు వచ్చిన వారు ఉద్యోగాలు కోల్పోకుండా తొలుత గ్రూప్‌ 1 నియామకాలు పూర్తి చేశామన్నారు. ఈ నియామకాలు పూర్తయిన తరువాతే గ్రూప్‌ 2 ఇస్తున్నామని అన్నారు. త్వరలో గ్రూప్‌ 3 నియామకాలు కూడా చేపడతామన్నారు..

TGPSC Group 3 Notification: నిరుద్యోగులకు సీఎం రేవంత్‌ శుభవార్త.. టీజీపీఎస్సీ గ్రూప్‌ 3 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్‌
TGPSC Group 3 Notification
Srilakshmi C
|

Updated on: Oct 20, 2025 | 6:10 AM

Share

హైదరాబాద్‌, అక్టోబర్ 20: రేవంత్‌ ప్రజాపాలనలో కొలువుల పండగ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందుల భాగంగా శనివారం హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రూప్‌ 2 నియామక పత్రాలను ఎంపికైన అభ్యర్ధులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందజేశారు. మొత్తం 782 మందికి నియామక పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. గ్రూప్‌ 1లోని అభ్యర్థులు గ్రూప్‌ 2లోనూ ఎంపికయ్యారని అన్నారు. గ్రూప్‌ 2లో తదుపరి ర్యాంకులు వచ్చిన వారు ఉద్యోగాలు కోల్పోకుండా తొలుత గ్రూప్‌ 1 నియామకాలు పూర్తి చేశామన్నారు. ఈ నియామకాలు పూర్తయిన తరువాతే గ్రూప్‌ 2 ఇస్తున్నామని అన్నారు. త్వరలో గ్రూప్‌ 3 నియామకాలు కూడా చేపడతామన్నారు. మట్టిలో మాణిక్యాలను టీజీపీఎస్సీ ద్వారా వెలికితీసి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేసే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుందన్నారు.

అయితే గ్రూప్‌ 1 పరీక్షల సందర్భంగా కొందరు ఎన్నోరకాల చిక్కులు సృష్ఠించారని, చౌకబారు విమర్శలు చేశారని సీఎం రేవంత్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో ఉద్యోగానికి రూ.2 నుంచి 3 కోట్లు సీఎం రేవంత్‌ తీసుకున్నట్లు కూడా ప్రచారం చేశారని ఆరోపించారు. ఎంపికైన నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు మాకు గుడిసే లేదు. కోటి ఎప్పుడైనా చూశామా అని కంటతడి పెట్టుకున్నారని అన్నారు. చిక్కుముళ్లు విప్పాలన్న సంకల్పంతో అడ్డంకులు అధిగమించి ఇదే వేదికగా నియామక పత్రాలు అందించినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పాటైన తొలి ఏడాదే నిరుద్యోగ యువతకు 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు. సహాయం కోసం ఎవరైనా మీ ఎదురుగా నిలబడితే.. ఆ స్థానంలో మీ తల్లిదండ్రుల్ని ఊహించుకుని నిర్ణయాలు తీసుకోవాలని, సొంతూరును అభివృద్ధి చేసుకోవాలని కొత్త ఉద్యోగులకు సీఎం ఉద్భోధ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.

6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?