AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET 2026 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. టాప్‌ 138లో ఎనిమిది మంది మనోళ్లే!

దేశవ్యాప్తంగా విడుదలైన నీట్ యూజీ 2026 రీటెస్ట్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. 690కి పైగా స్కోర్ సాధించిన 138 మంది టాపర్లలో తెలంగాణకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు చోటు దక్కించుకున్నారు. ఈ ఫలితాలు తెలంగాణ విద్యార్థుల ప్రతిభను మరోసారి చాటిచెప్పాయి..

NEET 2026 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. టాప్‌ 138లో ఎనిమిది మంది మనోళ్లే!
NEET Telangana Toppers
Srilakshmi C
|

Updated on: Jul 17, 2026 | 8:10 AM

Share

హైదరాబాద్‌, జూలై 17: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నీట్‌ యూజీ 2026 రీఎగ్జామ్‌ ఫలితాలు గురువారం రాత్రి విడుదలైన సంగతి తెలిసిందే. తుది ఆన్సర్‌ కీని విడుదల చేసిన కొద్ది గంటల్లోనే నీట్‌ ఫలితాలను ఎన్టీయే విడుదల చేసింది. తాజా ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్ధులు సత్తా చాటారు. ముఖ్యంగా తెలంగాణ విద్యార్థుల్లో దాదాపు 8 మంది ఏకంగా 690కిపైగా స్కోర్‌ సాధించారు. 690కి పైగా స్కోర్ సాధించిన 138 మంది టాపర్లలో తెలంగాణ విద్యార్థులు వీరే..

తెలంగాణ నీట్‌ 2026 టాపర్లు..

  • వీరయ్యగారి సాహ్యు 13వ ర్యాంకు
  • బూర సాయి శరన్‌ 19వ ర్యాంకు
  • కందగట్ల హనీష్‌ 21వ ర్యాంకు
  • అందెం సాయిచరణ్ రెడ్డి 38వ ర్యాంకు
  • మయూక్ జయసింహ 42వ ర్యాంకు
  • కొప్పెల్ల సాయి గాయత్రి తేజో అరుణిమ 83వ ర్యాంకు
  • రుతుంబిక మొహంతి 91వ ర్యాంకు
  • దేవేశ్‌ శ్రీగోపాల్‌ అగర్వాల్ 123వ ర్యాంకు

కాగా నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్‌కు దేశ వ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా.. ఇందులో 11.21 లక్షల మంది అర్హత సాధించినట్టు ఎన్‌టీఏ తెలిపింది. దీంట్లో 58 శాతంపైగా అమ్మాయిలే ఉండటం గమనార్హం. మొత్తం 720 మార్కులకుగాను 705కుపైగా మార్కులు సాధించి 17 మంది టాపర్లుగా నిలిచారు. ఈ జాబితాలో తెలంగాణ సహా పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌, యూపీ, మహారాష్ట్ర, బీహార్‌, తమిళనాడు విద్యార్థులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి మొత్తం 65,087 మంది విద్యార్థులు నీట్‌ పరీక్షకు హాజరయ్యారు.

Follow Us
త్రయోదశి శ్రాద్ధం ఈ పూర్వీకుల కోసమే చేస్తారా? తర్పణం, పిండదానం,
త్రయోదశి శ్రాద్ధం ఈ పూర్వీకుల కోసమే చేస్తారా? తర్పణం, పిండదానం,
10వ తరగతి, ఐటీఐతో రైల్వేలో 2,008 ఉద్యోగాలు.. నవంబర్ 6 వరకే ఛాన్స్
10వ తరగతి, ఐటీఐతో రైల్వేలో 2,008 ఉద్యోగాలు.. నవంబర్ 6 వరకే ఛాన్స్
పండగ ముందు సామాన్యులకు బిగ్‌ రిలీఫ్.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు
పండగ ముందు సామాన్యులకు బిగ్‌ రిలీఫ్.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు
లగ్జరీ లైఫ్ కాదని వ్యవసాయంతో నానా పటేకర్ అద్భుత ప్రపంచం..
లగ్జరీ లైఫ్ కాదని వ్యవసాయంతో నానా పటేకర్ అద్భుత ప్రపంచం..
ఓపెనర్లుగా అత్యధిక పరుగులు సాధించిన టాప్ 6 వీరులు వీరే
ఓపెనర్లుగా అత్యధిక పరుగులు సాధించిన టాప్ 6 వీరులు వీరే
ఆ మేయర్ సీట్లు ఎవరికి..? కూటమిలో ఎవరి లెక్కలు వారివే
ఆ మేయర్ సీట్లు ఎవరికి..? కూటమిలో ఎవరి లెక్కలు వారివే
అజిత్ అగర్కర్ బీసీసీఐ ద్వారా ఎంత సంపాదించారో తెలుసా?
అజిత్ అగర్కర్ బీసీసీఐ ద్వారా ఎంత సంపాదించారో తెలుసా?
నేషనల్ ఇన్సూరెన్స్‌ కంపెనీలో 321 ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం
నేషనల్ ఇన్సూరెన్స్‌ కంపెనీలో 321 ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం
తెలంగాణ గడ్డపై బతుకమ్మకు ఇంత ప్రత్యేకత ఎందుకు?
తెలంగాణ గడ్డపై బతుకమ్మకు ఇంత ప్రత్యేకత ఎందుకు?
17 వేల అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. ఆ తర్వాత సీన్ ఇదే
17 వేల అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. ఆ తర్వాత సీన్ ఇదే