TS Inter: తెలంగాణ ఇంటర్ ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల.. చివరి తేదీ ఎప్పుడంటే
తెలంగాన ఇంటర్ ఎగ్జామ్స్ కు సంబంధించి కీలక ప్రకటన వచ్చేసింది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కు సంబంధించి ఫీజుల చెల్లింపు షెడ్యూల్ ను విడుదల చేశారు. నవంబర్ 6వ తేదీ నుంచి ఫీజు చెల్లింపును ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఫీజుల స్వీకరణకు చివరి తేదీ ఎప్పుడంటే...
విద్యార్ధులకు తెలంగాన ఇంటర్మీడియట్ బోర్డ్ కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగానే ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపులకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. నవంబర్ 6వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పరీక్ష ఫీజులను చెల్లించవచ్చని అధికారులు తెలిపారు. ఆలస్య రుసుముతో ఫీజులు చెల్లించే అవకాశం కల్పించారు. డిసెంబర్ 4వ తేదీ వరకు రూ. 100 జరిమానాతో ఫీజు చెల్లించవచ్చు. అలాగే రూ. 500 జరిమానాతో డిసెంబర్ 12 వరకు చెల్లించవచ్చు. రూ. 1000 జరిమానాతో డిసెంబర్ 18 వరకు, రూ. 2000 జరిమానాతో డిసెంబర్ 27 వరకు గడువు ఫీజును చెల్లించే అవకాశం కల్పించారు.
పరీక్ష ఫీజు వివరాలివే..
* ఫస్టియర్ జనరల్ కోర్స్ అభ్యర్థులు రూ.520/-
* ఫస్టియర్ ఒకేషనల్ కోర్స్ – ప్రాక్టికల్స్ తో అభ్యర్థులు రూ.750
* సెకండియర్ జనరల్ కోర్స్ ఆర్ట్స్ అభ్యర్థులు రూ.520
* సెకండియర్ జనరల్ కోర్స్ సైన్స్ అభ్యర్థులు రూ.750
* సెకండియర్ ఒకేషనల్ కోర్స్ అభ్యర్థులు (థియరీ+ప్రాక్టికల్స్) రూ.750గా నిర్ణయించారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..