హైదరాబాద్, ఏప్రిల్ 25: తెలంగాణలో ఇంటర్ బోర్డు ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షల ఫలితాలను బుధవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పదో తరగతి పరీక్షల విడుదల తేదీని కూడా విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు పదో తరగతి ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఏప్రిల్ 30వ తేదీన ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం చేతుల మీదగా పదో తరగతి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువరించారు.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 20 నాటికి మూల్యాంకన ప్రక్రియ కూడా పూర్తి చేశారు. ఈ వారం రోజుల్లో డీ కోడిండ్ ప్రక్రియ కూడా పూర్తి చేసి, ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు పదోతరగతి పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల ప్రకటన అనంతరం టీవీ9 తెలుగు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ఇప్పటికే ఇంటర్మీడియట్ ఫలితాలను ప్రకటించిన విద్యాశాఖ ఎన్నికలకు ముందే పదో తరగతి ఫలితాల ప్రకటన ప్రక్రియను కూడా పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.