AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IIT Seats: ఐఐటీల్లో సీట్లు సాధించిన విద్యార్ధులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఎప్పుడిస్తారంటే?

రాష్ట్రంలోని విద్యార్ధులకు పాఠశాల విద్యాశాఖ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని కస్తూర్బా విద్యాలయాలు, మోడల్‌ స్కూళ్లు, రెసిడెన్షియల్‌ గురుకులాల్లో ఇంటర్‌ చదివిన విద్యార్ధులు ఎవరైనా ఐఐటీల్లో సీట్లు సాధిస్తే.. వారికి ముఖ్యమంత్రి చేతుల మీదగా ఉచిత ల్యాప్ టాప్ లు పంపిణీ చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ..

IIT Seats: ఐఐటీల్లో సీట్లు సాధించిన విద్యార్ధులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఎప్పుడిస్తారంటే?
Free Laptops To Students
Srilakshmi C
|

Updated on: Jul 12, 2025 | 6:23 AM

Share

హైదరాబాద్‌, జులై 12: తెలంగాణ రాష్ట్రంలోని కస్తూర్బా విద్యాలయాలు, మోడల్‌ స్కూళ్లు, రెసిడెన్షియల్‌ గురుకులాల్లో ఇంటర్‌ చదివిన విద్యార్ధులకు పాఠశాల విద్యాశాఖ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈ పాఠశాలల్లో ఇంటర్‌ పాసై 2025-26 విద్యా సంవత్సరానికి ఐఐటీల్లో సీటు సాధించిన వారికి ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందజేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అలాగే పది, ఇంటర్‌లో ప్రతి జిల్లాలో అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురి చొప్పున విద్యార్ధులకు నగదు బహుమతి అందజేయనున్నట్లు ప్రకటించింది. అలాగే క్రీడల్లో ప్రతిభ చూపిన విద్యార్ధులకు కూడా బహుమతులు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. వీరందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా జులై 16న పంపిణీ కార్యక్రమం ఉంటుందని సమాచారం.

ఏపీ పాలిసెట్‌లో 56 శాతం సీట్ల భర్తీ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పాలిసెట్‌ కౌన్సెలింగ్‌లో 56 శాతం సీట్లు భర్తీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 255 పాలిటెక్నిక్‌ కాలేజీలు ఉండగా.. వీటిల్లో కన్వీనర్‌ కోటా కింద 79,141 సీట్లు ఉన్నాయి. వీటిల్లో ఇప్పటి వరకు 44,511 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ ఏడాది పాలిసెట్‌లో మొత్తం 1,33,359 మంది అర్హత సాధించగా, వీరిలో కౌన్సెలింగ్‌కు 48,241 మంది ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించారు. వీరిలో 47,159 మంది సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. అందులో 46,084 మంది వెబ్‌ ఐచ్ఛికాలు నమోదు చేసుకున్నారు. క్రీడా, ఎన్‌సీసీ కోటా కింద 1,051 మందికి సీట్ల కేటాయింపు పెండింగ్‌లో పెట్టారు. శాప్, ఎన్‌సీసీ డైరెక్టర్‌ నుంచి ధ్రువీకరణ పత్రాల పరిశీలన జాబితా వచ్చిన తర్వాత వీరందరికీ సీట్ల కేటాయింపు ఉంటుంది.

ఏపీ ఐసెట్‌ 2025 కౌన్సెలింగ్‌ ప్రారంభం

ఏపీలోని ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్‌ కౌన్సెలింగ్‌కు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు జులై 10 నుంచి ప్రారంభమైనాయి. జులై 10 నుంచి 14 తేదీల మధ్య రిజిస్ట్రేషన్లు ఉంటాయి. జులై 11 నుంచి15వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన, జులై 13 నుంచి 16 వరకు వెబ్‌ ఐచ్ఛికాల నమోదు అవకాశం కల్పించారు. జులై 19న సీట్ల కేటాయింపు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.

సంక్రాంతి స్పెషల్: వంటరాని వారి కోసం ఇన్స్టంట్ అరిసెల రెసిపీ
సంక్రాంతి స్పెషల్: వంటరాని వారి కోసం ఇన్స్టంట్ అరిసెల రెసిపీ
వాటర్ బాటిల్ కడగడం కష్టంగా ఉందా..? ఈ సింపుల్ హాక్ ట్రై చేయండి
వాటర్ బాటిల్ కడగడం కష్టంగా ఉందా..? ఈ సింపుల్ హాక్ ట్రై చేయండి
తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకం.. ఉచితంగా కిట్
తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకం.. ఉచితంగా కిట్
బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగే షాక్.. ఆ వ్యాఖ్యలు కొట్టిపారేసిన ఐసీసీ
బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగే షాక్.. ఆ వ్యాఖ్యలు కొట్టిపారేసిన ఐసీసీ
చైనీస్ మాంజానే కాదు.. గల్లీల్లో తయారయ్యే గాజు మాంజాలు డేంజరే..!
చైనీస్ మాంజానే కాదు.. గల్లీల్లో తయారయ్యే గాజు మాంజాలు డేంజరే..!
సిట్రస్ పండ్లతో జాగ్రత్త! ఇలా తింటే డేంజరస్ కాంబినేషన్..!
సిట్రస్ పండ్లతో జాగ్రత్త! ఇలా తింటే డేంజరస్ కాంబినేషన్..!
చలికాలంలో క్యారెట్ తింటే ఏమవుతుంది.. తినేముందు ఇవి పక్కా..
చలికాలంలో క్యారెట్ తింటే ఏమవుతుంది.. తినేముందు ఇవి పక్కా..
భాగ్యనగరం చుట్టి రావాలా? 2 రోజుల్లో చూడాల్సిన అద్భుత ప్రదేశాలు..
భాగ్యనగరం చుట్టి రావాలా? 2 రోజుల్లో చూడాల్సిన అద్భుత ప్రదేశాలు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు.. కట్‌చేస్తే.. హ్యాట్రిక్ కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు.. కట్‌చేస్తే.. హ్యాట్రిక్ కాదండోయ్
అమెరికాలో ఒక కిలో చేదు కాకరకాయ ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా?
అమెరికాలో ఒక కిలో చేదు కాకరకాయ ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా?