16th Rozgar Mela: నేడు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న PM మోదీ
నేడు 16 వ రోజ్‌గార్ మేళా జరగనుంది. దేశవ్యాప్తంగా 47 చోట్ల జరుగుతున్న రోజ్‌గార్ మేళా జరగనుంది. ఇందులో భాగంగా 51 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ప్రధాని మోదీ అందించనున్నారు. రోజ్‌గార్ మేళా ద్వారా కేంద్ర ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలలో ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ వచ్చిన రోజ్‌గార్ మేళాలలో 10 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించారు..

న్యూఢిల్లీ, జులై 12: రోజ్‌గార్ మేళాలో భాగంగా ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికైన వారికి వర్చువల్‌గా నియామక పత్రాలు ప్రధాని మోదీ శనివారం (జులై 12) అందించనున్నారు. ప్రభుత్వంలో వివిధ విభాగాలు, సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికైన 51,000కు పైగా యువతీయువకులకు నియామక పత్రాలను ఈ రోజు ఉదయం 11 గంటలకు వర్చువల్ గా పంపిణీ చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా ఉద్యోగాలకు ఎంపికైన యువతి, యువకులను ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తారు.
ఉపాధికల్పనకు అమిత ప్రాధాన్యాన్ని ఇస్తామన్న ప్రధానమంత్రి వాగ్దానాన్ని నెరవేర్చే బాటలో ‘రోజ్‌గార్ మేళా’ ఒక ముందడుగుగా ఉంది.. యువతకు బతుకుదెరువును చూపించి వారికి సాధికారతను కల్పించడంతో పాటు, దేశ నిర్మాణంలో వారు పాలుపంచుకొనేందుకు చక్కని అవకాశాలను ఇవ్వడంలో ‘రోజ్‌గార్ మేళా’ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ వచ్చిన రోజ్‌గార్ మేళాలలో 10 లక్షలకు పైగా నియామక పత్రాలను అందజేశారు.
विकसित और आत्मनिर्भर भारत के निर्माण में युवा साथियों की भागीदारी बढ़ाने के लिए हम कृतसंकल्प हैं। इसी कड़ी में कल 12 जुलाई को सुबह 11 बजे वीडियो कॉन्फ्रेंसिंग के जरिए एक और रोजगार मेले का हिस्सा बनूंगा, जिसमें हजारों युवाओं को नियुक्ति-पत्र सौंपे जाएंगे।https://t.co/PgasVSXv9J
— Narendra Modi (@narendramodi) July 11, 2025
16వ ‘రోజ్‌గార్ మేళా’ను దేశవ్యాప్తంగా 47 చోట్ల నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలలో ఈ ఉద్యోగ భర్తీ ఉంటుంది.. కొత్తగా ఉద్యోగాల్లో నియామక ప్రక్రియ పూర్తి అయిన వారు రైల్వే శాఖ, హోం శాఖ, తపాలా విభాగం, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, ఆర్థిక సేవల విభాగం, కార్మిక, ఉపాధికల్పన శాఖలతో పాటు ఇతర మంత్రిత్వ శాఖల్లోనూ, విభాగాల్లోనూ చేరనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.








