AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGSRTC Conductor Jobs 2025: పదో తరగతి అర్హతతో ఆర్టీసీలో ఔట్‌సోర్సింగ్‌ బస్సు కండక్టర్ పోస్టులు. నెల జీతం ఎంతో తెలుసా?

రాష్ట్రంలో ఆర్టీసీ కొత్త ఉద్యోగాల ప్రకటనలకు గత ఏడాది నుంచి నిరుద్యోగులను ఊరిస్తుంది. అయితే ఇటీవల ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో డ్రైవర్ల నియామకాన్ని చేపట్టిన ఆర్టీసీ.. తాజాగా కండక్టర్ల పోస్టులను కూడా అదే విధానంలో నియమించుకునేందుకు కసరత్తు చేస్తుంది. ఇందుకు సంబంధించి తాజాగా మార్గదర్శకాలను..

TGSRTC Conductor Jobs 2025: పదో తరగతి అర్హతతో ఆర్టీసీలో ఔట్‌సోర్సింగ్‌ బస్సు కండక్టర్ పోస్టులు. నెల జీతం ఎంతో తెలుసా?
TGSRTC Conductor Jobs
Srilakshmi C
|

Updated on: May 25, 2025 | 9:40 AM

Share

హైదరాబాద్‌, మే 25: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కొత్త ఉద్యోగాల ప్రకటనలకు గత ఏడాది నుంచి నిరుద్యోగులను ఊరిస్తుంది. అయితే ఇటీవల ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో డ్రైవర్ల నియామకాన్ని చేపట్టిన ఆర్టీసీ.. తాజాగా కండక్టర్ల పోస్టులను కూడా అదే విధానంలో నియమించుకునేందుకు కసరత్తు చేస్తుంది. ఇందుకు సంబంధించి తాజాగా మార్గదర్శకాలను సైతం ఖరారు చేసింది. ఈ పోస్టులకు రాష్ట్రంలోని నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు వయసుతోపాటు పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్న కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఇక ఈ తరహాలో ఎంపికైన కండక్టర్లకు ప్రతినెలా చెల్లించే కన్సాలిడేటెట్‌ జీతం మొత్తం రూ.17,969గా ఆర్టీసీ నిర్ణయించింది. పైగా ఈ పోస్టులకు ఎంపికైన వారు రూ.2 లక్షల మొత్తాన్ని సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగంలో చేరాక విధి నిర్వహణలో సంస్థకు నష్టం వాటిల్లితే దీని నుంచి రికవరీ చేస్తామని ఆర్టీసీ ప్రకటించింది. అయితే వీరికి వర్క్‌మెన్స్‌ కాంపన్సేషన్‌ యాక్ట్‌ అస్సలు వర్తించదని ఆర్టీసీ యాజమన్యం తేల్చి చెప్పింది. పీఎఫ్, ఈఎస్‌ఐ లాంటి చట్టబద్ధమైన వెసులుబాట్లు కూడా ఉండవని స్పష్టం చేసింది.

మరోవారంలో ఏపీపీఎస్సీ ఎఫ్‌ఆర్‌ఓ పోస్టులకు రాత పరీక్ష.. హాల్‌టికెట్లు విడుదల

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ (APPSC).. ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ (FRO) మెయిన్స్‌ రాత పరీక్ష మరో వారంలో ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్స్‌ను కమిషన్‌ తాజాగా విడుదల చేసింది. అభ్యర్థులు మే 26వ తేదీ నుంచి అధికారిక వెబ్‌సైట్‌ లో హాల్‌ టికెట్లను అందుబాటులో ఉంచనుంది. ఇక ఏపీపీఎస్సీ జూన్‌ 2 నుంచి 4వ తేదీ వరకు మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించనుంది. ఈ ఏడాది మార్చి 16న ఈ పోస్టులకు సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. గత ఏడాది జారీ చేసిన 37 ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ కొనసాగుతుంది.

ఇవి కూడా చదవండి

ఏపీపీఎస్సీ ఎఫ్‌ఆర్‌ఓ పోస్టులకు హాల్‌ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..