AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS ECET 2025 Toppers List: తెలంగాణ ఈసెట్ ఫలితాలు వచ్చేశాయ్‌.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే!

బీఈ, బీటెక్‌, బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో నేరుగా రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పించేందుకు మే12న నిర్వహించిన తెలంగాణ ఈసెట్ ఫలితాలు ఆదివారం (మే 25) మధ్యాహ్నం ఒంటి గంటకు విడుదలైనాయి. మొత్తం 18,998 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ పరీక్ష రాసిన విద్యార్ధులు ఈ కింది డైరెక్ట్ లింక్‌ ద్వారా..

TS ECET 2025 Toppers List: తెలంగాణ ఈసెట్ ఫలితాలు వచ్చేశాయ్‌.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ECET 2025 Results
Srilakshmi C
|

Updated on: May 25, 2025 | 1:33 PM

Share

హైదరాబాద్‌, మే 25: తెలంగాణ ఈసెట్ ఫలితాలు ఆదివారం (మే 25) మధ్యాహ్నం ఒంటి గంటకు విడుదలైనాయి. మొత్తం 18,998 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ పరీక్ష రాసిన విద్యార్ధులు ఈ కింది డైరెక్ట్ లింక్‌ ద్వారా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో 2025-2026 విద్యా సంవత్సరానికి బీఈ, బీటెక్‌, బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో నేరుగా రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పించేందుకు మే12న నేడు ఈసెట్‌ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.

తెలంగాణ ఈసెట్ పరీక్ష ఫలితాలు ఆదివారం (మే 25) మధ్యాహ్నం ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి విడుదల చేశారు. తాజాగా విడుదలైన ఈసెట్ ఫ‌లితాల్లో మొత్తం 93.87 శాతం ఉత్తీర్ణత సాధించారు. మెటలార్జిక‌ల్ ఇంజినీరింగ్, బీఎస్సీ మ్యాథ్స్, ఫార్మసీలో 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ బాలకిష్టారెడ్డి తెలిపారు. ఇక ఎప్పటి మాదిరిగానే  అన్ని విభాగాల్లో అమ్మాయిలు అత్యధికంగా ఉత్తీర్ణత సాధించారు. విద్యార్ధులు తమ వివరాలు నమోదు చేసి ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా ర్యాంకు కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

తెలంగాణ ఈసెట్ 2025 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

విభాగాల వారీగా టాపర్లు వీరే..

  • బీఎస్సీ మ్యాథ్స్‌ విభాగంలో సంతోష్ కుమార్
  • మికల్ ఇంజినీరింగ్‌ విభాగంలో లెంక తేజ సాయి
  • సివిల్ ఇంజినీరింగ్‌ విభాగంలో గోల్కొండ నిఖిల్ కౌశిక్
  • కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌ విభాగంలో శ్రీకాంత్
  • ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో కట్లే రేవతి
  • ఎల‌క్ట్రికల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌ విభాగంలో కాసుల శ్రావణి
  • ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్సుట్రుమెంటేష‌న్ ఇంజినీరింగ్‌ విభాగంలో రాపర్తి చందన
  • మెకానికల్ ఇంజినీరింగ్‌ విభాగంలో పోతుగంటి కార్తిక్
  • మెటలర్జికల్ ఇంజినీరింగ్‌ విభాగంలో తోట సుబ్రహ్మణ్యం
  • మైనింగ్ ఇంజినీరింగ్‌ విభాగంలో కుర్మా అక్షయ
  • ఫార్మసీ విభాగంలో ఐలి చందన

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్