AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRB NTPC 2025 Admit Card: మరో 10 రోజుల్లోనే ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ రాత పరీక్షలు.. మొత్తం 1.2 కోట్ల మంది పోటీ!

దేశంలోని వివిధ రైల్వే రీజియన్లలో పలు ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) గతేడాది ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 11,558 నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ పోస్టులకు దేశ వ్యాప్తంగా ఏకంగా 1.2 కోట్ల మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. మొత్తం పోస్టుల్లో గ్రాడ్యుయేట్ స్థాయికి 8,113 ఉద్యోగాలు, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి 3,445 ఉద్యోగాలు..

RRB NTPC 2025 Admit Card: మరో 10 రోజుల్లోనే ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ రాత పరీక్షలు.. మొత్తం 1.2 కోట్ల మంది పోటీ!
RRB NTPC 2025 Exam Dates
Srilakshmi C
|

Updated on: May 25, 2025 | 8:42 AM

Share

హైదరాబాద్‌, మే 25: దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రీజియన్లలో పలు ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) గతేడాది ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 11,558 నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ పోస్టులకు దేశ వ్యాప్తంగా ఏకంగా 1.2 కోట్ల మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. మొత్తం పోస్టుల్లో గ్రాడ్యుయేట్ స్థాయికి 8,113 ఉద్యోగాలు, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి 3,445 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న ఈ పరీక్షల షెడ్యూల్‌ను తాజాగా ఆర్‌ఆర్‌బీ విడుదల చేసింది.

తాజా ప్రకటన మేరకు రైల్వే ఎన్‌టీపీసీ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేట్‌ పోస్టుల పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 5వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరగనున్నాయి. ఆయా తేదీల్లో ప్రతిరోజూ మూడు షిఫ్టులలో ఈ పరీక్షలు జరుగుతాయి. మొదటి షిఫ్ట్ 1 ఉదయం 9 నుంచి 10.30 వరకు, సెకండ్‌ షిఫ్ట్ 2 మధ్యాహ్నం 12.45 నుంచి 2.15 గంటల వరకు, థార్డ్‌ షిఫ్ట్ 3 సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు ఉంటుంది. సీబీటీ 1 పరీక్ష 90 నిమిషాల వ్యవధిలో మొత్తం 100 మల్టిపుల్ ఛాయిస్‌ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవల్సి ఉంటుంది. ఈ పరీక్షలో నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానాలకు మూడవ వంతు మార్కును తగ్గిస్తారు. ఈ పరీక్షల్లో ప్రతిభ కనబరచిన వారికి వివిధ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలకు సంబంధించి గ్రాడ్యుయేట్ కేటగిరీలో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులను భర్తీ చేస్తారు.

జేఈఈ మెయిన్‌ 2025 పేపర్‌2 ఫలితాలు వచ్చేశాయ్‌.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

బీఆర్క్‌/ బీ ప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్‌ 2025 రెండో విడత (ఏప్రిల్‌) పేపర్‌ 2 ఎగ్జామినేషన్‌ తుది ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. జేఈఈ మెయిన్‌ రెండో విడత పరీక్షలు ఏప్రిల్‌ 9వ తేదీన పేపర్‌-2ఏ, 2బీ (బీఆర్క్‌/బీ ప్లానింగ్‌) ప్రవేశ పరీక్షలు నిర్వహించని సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

జేఈఈ మెయిన్‌ పేపర్‌2 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..