Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఆర్టీసీలో 3038 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పోస్టులు ఇలా..

తెలంగాణ ఆర్టీసీలో 3 వేల 38 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్‌ విడదల చేయనుంది ప్రభుత్వం. పోస్టుల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వ అనుమతి ఇచ్చిందని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. బస్‌ డ్రైవర్లతో పాటు వివిధ కేటగిరీల్లో పోస్టుల భర్తీ చేయనున్నట్టు చెప్పారు. కొత్తబస్సుల కొనుగోలు అనంతరం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలవుతుందన్నారు పొన్నం.

Telangana Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఆర్టీసీలో 3038 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పోస్టులు ఇలా..
TGSRTC Recruitment 2025
Yellender Reddy Ramasagram
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Apr 20, 2025 | 11:12 AM

Share

తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలోనే టీజీఎస్ ఆర్టీసీలో 3038 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఆర్టీసీలో సుదీర్ఘ కాలం తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తుండడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. 3038 ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని త్వరలోనే నోటిఫికేషన్ వేసి సాధ్యమైనంత త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు. బస్‌ డ్రైవర్లతో పాటు వివిధ కేటగిరీల్లో పోస్టుల భర్తీ చేయనున్నట్టు చెప్పారు.

మొత్తం 3038 ఉద్యోగాల్లో.. పోస్టులు ఇలా..

  • డ్రైవర్ -2000
  • శ్రామిక్ -743
  • డిప్యూటీ సూపరిండెంట్ (ట్రాఫిక్) – 84
  • డిప్యూటీ సూపరిండెంట్ (మెకానికల్) – 114
  • డిపో మేనేజర్/ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ – 25
  • అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ – 18
  • అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) – 23
  • సెక్షన్ ఆఫీసర్ ( సివిల్) -11
  • అకౌంట్ ఆఫీసర్స్ – 6
  • మెడికల్ ఆఫీసర్స్ జనరల్ – 7
  • మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్ – 7

ఈ పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. ఇప్పటికే ప్రజా పాలన ప్రభుత్వం లో నిరుద్యోగులకు పెద్ద పీఠ వేస్తూ దాదాపు 60 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిందని.. పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఇప్పుడు మరోసారి భారీస్థాయిలో ఉద్యోగాల నోటిఫికేషన్లు క్యాలండర్ ప్రకారం విడుదల చేయనుందని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకొని బాగా ప్రిపేర్ కావాలని సూచించారు. ఆర్టీసీ లో సుదీర్ఘ కాలం తర్వాత ఉద్యోగాల భర్తీ జరుగుతుండడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఆర్టీసీ ఉద్యోగాలు భర్తీ చేయాలని భావించినప్పుడు ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కొనసాగుతుండటంతో ఆర్టీసీ ఉద్యోగాల నోటిఫికేషన్ ఆలస్యం అయింది. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ప్రజా పాలన ప్రభుత్వం భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు సిద్ధమయ్యిందన్నారు.

రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తుందని దీని ద్వారా ఆర్టీసీలో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందని వెల్లడించారు. ఇప్పటి వరకు ఆర్టీసీ లో 165 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని.. వారు 5500 కోట్ల రూపాయలు ఆదా చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే మహా లక్ష్మి కోసం కొత్త బస్సులు కొనుగోలు చేశామని ఇప్పుడు ఉద్యోగాల భర్తీకి ఆర్టీసీ సన్నద్ధం అయిందని పేర్కొన్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.