AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PGECET & Lawcet 2025 Counselling: పీజీఈసెట్‌, లాసెట్‌, పీసీ ఎల్‌సెట్‌ 2025 కౌన్సెలింగ్‌ షెడ్యూళ్లు వచ్చేశాయ్‌..

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లా కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ ఎల్‌ఎల్‌బీ సీట్ల భర్తీకి లాసెట్, ఎల్‌ఎల్‌ఎం మాస్టర్‌ కోర్సుల్లో చేరేందుకు పీజీ ఎల్‌సెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఈ మేరకు ప్రవేశాల కమిటీ షెడ్యూల్‌ విడుదల చేసింది. అలాగే ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశానికి పీజీఈసెట్ కౌన్సెలింగ్‌..

PGECET & Lawcet 2025 Counselling: పీజీఈసెట్‌, లాసెట్‌, పీసీ ఎల్‌సెట్‌ 2025 కౌన్సెలింగ్‌ షెడ్యూళ్లు వచ్చేశాయ్‌..
Counselling Schedule
Srilakshmi C
|

Updated on: Jul 26, 2025 | 3:45 PM

Share

హైదరాబాద్‌, జులై 26: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లా కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ ఎల్‌ఎల్‌బీ సీట్ల భర్తీకి లాసెట్, ఎల్‌ఎల్‌ఎం మాస్టర్‌ కోర్సుల్లో చేరేందుకు పీజీ ఎల్‌సెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఈ మేరకు ప్రవేశాల కమిటీ షెడ్యూల్‌ విడుదల చేసింది. అలాగే ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశానికి పీజీఈసెట్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ కూడా ఖరారు చేశారు. ఈ మూడింటికి సంబంధించిన షెడ్యూల్‌లను ఉన్నత విద్యా మండలి శనివారం విడుదల చేసింది. ఇందులో పీజీఈసెట్‌ కౌన్సెలింగ్‌ ఆగస్టు 1 నుంచి ప్రారంభమవుతుంది. ఇక లాసెట్‌ కౌన్సెలింగ్‌ (యూజీ) ఆగస్టు 4 నుంచి, పీజీ ఎల్‌సెట్‌ కౌన్సెలింగ్‌ ఆగస్టు 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో శుక్రవారం ఛైర్మన్‌ ఆచార్య బాలకిష్టారెడ్డి ఆధ్వర్యంలో ప్రవేశాల కమిటీ సమావేశాలు నిర్వహించి, ఈ మేరకు షెడ్యూల్‌లను ఖరారు చేశారు.

తెలంగాణ పీపీఈసెట్‌ 2025 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌

  • ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు: ఆగస్టు 1 నుంచి 9వ తేదీ వరకు
  • వెబ్‌ ఆప్షన్లు: ఆగస్టు 11, 12 తేదీల్లో
  • సీట్ల కేటాయింపు: ఆగస్టు 16న ఉంటుంది
  • కాలేజీల్లో రిపోర్టింగ్‌: ఆగస్టు 18 నుంచి 21వ తేదీ వరకు

తెలంగాణ లా సెట్‌ 2025 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌

  • ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు: ఆగస్టు 41 నుంచి 14వ తేదీ వరకు
  • వెబ్‌ ఆప్షన్లు: ఆగస్టు 16, 17 తేదీల్లో
  • సీట్ల కేటాయింపు: ఆగస్టు 22న ఉంటుంది
  • కాలేజీల్లో రిపోర్టింగ్‌: ఆగస్టు 22 నుంచి 25వ తేదీ వరకు

తెలంగాణ పీజీ ఎల్‌సెట్‌ 2025 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌

  • ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు: ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్‌ 1వ తేదీ వరకు
  • వెబ్‌ ఆప్షన్లు: సెప్టెంబర్‌ 3, 4 తేదీల్లో
  • సీట్ల కేటాయింపు: సెప్టెంబర్‌ 8న ఉంటుంది
  • కాలేజీల్లో రిపోర్టింగ్‌: సెప్టెంబర్‌ 9 నుంచి 13వ తేదీ వరకు

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.