AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sports Quota Constable Jobs 2025: నిరుద్యోగులకు అలర్ట్‌.. స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల! నో ఎగ్జాం..

స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) నాన్-గెజిటెడ్ అండ్‌ నాన్ మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద పురుష, మహిళా అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..

Sports Quota Constable Jobs 2025: నిరుద్యోగులకు అలర్ట్‌.. స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల! నో ఎగ్జాం..
BSF Sports Quota Constable Jobs
Srilakshmi C
|

Updated on: Jul 26, 2025 | 3:03 PM

Share

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF).. స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) నాన్-గెజిటెడ్ అండ్‌ నాన్ మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 241 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన మహిళా, పురుష అభ్యర్థులు ఎవరైనా ఆగస్టు 20వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. క్రీడాంశాలు, అర్హతలు, ఎంపిక విధానం వంటి ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, డైవింగ్, వాటర్ పోలో, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, సైక్లింగ్, క్రాస్ కంట్రీ, ఈక్వెస్ట్రియన్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, హాకీ, ఐస్-స్కీయింగ్, జూడో, కరాటే, వాలీబాల్, వెయిట్‌ లిఫ్టింగ్‌, వాటర్‌ స్పోర్ట్స్, రెజ్లింగ్, షూటింగ్, టైక్వాండో, వుషు, ఫెన్సింగ్, కాయాకింగ్‌, కానోయింగ్‌ (పడవ పందెం), రోయింగ్‌, టెబుల్‌ టెన్నిస్‌ వంటి తదితర ఆటల్లో ప్రావీణ్యం కలిగి ఉండాలి. వీరు సంబంధిత క్రీడాంశంలో నేషనల్‌ లేదా ఇంటర్నేషనల్‌ ఈవెంట్స్‌లలో తప్పనిసరిగా పాల్గొని ఉండాలి. అలాగే పదో తరగతి లేదా మెట్రిక్యులేషన్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 01 ఆగస్టు 2025 నాటికి తప్పనిసరిగా 18 నుంచి 23 సంవత్సరాల మధ్యలో ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ ద్వారా ఆగస్టు 20, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులు రూ.147.20 తప్పని సరిగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. అప్లికేషన్స్‌ షార్ట్‌లిస్టింగ్‌, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (పీఎస్‌టీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అంటే ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండానే ఎంపిక చేస్తారు.

ఇవి కూడా చదవండి

బీఎస్‌ఎఫ్‌ స్పోర్ట్స్ కోటా కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
టీ20 వరల్డ్ కప్ సెమీస్‌కు వెళ్లేది ఈ జట్లే..గ్రోక్ షాకింగ్ జోస్యం
టీ20 వరల్డ్ కప్ సెమీస్‌కు వెళ్లేది ఈ జట్లే..గ్రోక్ షాకింగ్ జోస్యం
వాట్సాప్‌గ్రూప్‌ సభ్యులకు గుడ్‌న్యూస్‌.. సరికొత్త ఫీచర్‌..!
వాట్సాప్‌గ్రూప్‌ సభ్యులకు గుడ్‌న్యూస్‌.. సరికొత్త ఫీచర్‌..!
భార్యను తీవ్రంగా కొట్టి.. చనిపోయిందని వదిలి వెళ్లిన భర్త.. చివరకు
భార్యను తీవ్రంగా కొట్టి.. చనిపోయిందని వదిలి వెళ్లిన భర్త.. చివరకు
ఒకప్పుడు హీరో.. ఇప్పుడు స్టార్ డైరెక్టర్..!
ఒకప్పుడు హీరో.. ఇప్పుడు స్టార్ డైరెక్టర్..!
ధన లాభం, కొత్త ఉద్యోగం.. పంచగ్రాహి రాజయోగంతో ఈ రాశులదే అదృష్టం
ధన లాభం, కొత్త ఉద్యోగం.. పంచగ్రాహి రాజయోగంతో ఈ రాశులదే అదృష్టం
5 ఏళ్ల నుండి 75 ఏళ్ల వరకు.. ఏ వయసు వారు ఎంతసేపు నడవాలో తెలుసా..?
5 ఏళ్ల నుండి 75 ఏళ్ల వరకు.. ఏ వయసు వారు ఎంతసేపు నడవాలో తెలుసా..?
ఇండియాకు రప్పించేంత వరకు నిద్రపోనూ..
ఇండియాకు రప్పించేంత వరకు నిద్రపోనూ..
హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖలో ఇంటర్న్‌షిప్‌లు 2026.. యువతకు ఛాన్స్
హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖలో ఇంటర్న్‌షిప్‌లు 2026.. యువతకు ఛాన్స్
తక్కువ మసాలాలతో అదిరిపోయే మటన్ సుక్కా.. అదిరిపోయే రెసిపీ
తక్కువ మసాలాలతో అదిరిపోయే మటన్ సుక్కా.. అదిరిపోయే రెసిపీ
ప్రియురాలు మృతి.. విశాఖలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య..
ప్రియురాలు మృతి.. విశాఖలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య..