TS High Court Jobs 2023: ఏడు నుంచి పదో తరగతి అర్హతతో తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు.. నెలకు రూ.58,650ల జీతం..

తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన.. 50 ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

TS High Court Jobs 2023: ఏడు నుంచి పదో తరగతి అర్హతతో తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు.. నెలకు రూ.58,650ల జీతం..
TS High Court Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 16, 2023 | 3:51 PM

తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన.. 50 ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏడో తరగతి నుంచి పదో తరగతి మధ్య ఏదైనా తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పదో తరగతి కంటే ఎక్కువ విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. అభ్యర్థులు దరఖాస్తులో వృత్తిపరమైన నైపుణ్యాలను దరఖాస్తులో పేర్కొనాలి. దరఖాస్తుదారుల వయసు జనవరి 11, 2023 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 11, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు జనవరి 21 నుంచి ప్రారంభమవుతాయి. దరఖాస్తు సమయంలో ఓసీ/బీసీ కేటగిరీలకు చెందిన వారు రూ.600, ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారు రూ.400లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, రిజర్వేషన్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష 2023 మార్చిలో నిర్వహిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.19,00ల నుంచి రూ.58,650ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.