Telangana: మళ్లీ రద్దు.. గ్రూప్-1 పరీక్ష మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశం.. అభ్యర్థుల్లో టెన్షన్..
Group 1 prelims exam cancel: గతంలో పేపర్ లీకేజీ కారణంగా గ్రూప్-1 రద్దు.. ఇప్పుడు బయోమెట్రిక్ తీసుకోలేదన్న కారణంతో రద్దు.. ఇలా టీఎస్‌పీఎస్‌కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇటీవల TSPSC నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని శనివారం తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
Group 1 prelims exam cancel: గతంలో పేపర్ లీకేజీ కారణంగా గ్రూప్-1 రద్దు.. ఇప్పుడు బయోమెట్రిక్ తీసుకోలేదన్న కారణంతో రద్దు.. ఇలా టీఎస్‌పీఎస్‌కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇటీవల TSPSC నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని శనివారం తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. గతంలో టీఎస్ పేపర్ లీకేజీ తర్వాత గ్రూప్-1 రద్దు చేసిన విషయం తెలిసిందే. అనంతరం జూన్ 11న జరిగిన గ్రూప్ 1 పరీక్షకు 2 లక్షల 33 వేల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 503 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం ఈ పరీక్ష నిర్వహించారు.
అయితే, గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని హైకోర్టులో పలువురు అభ్యర్థులు పిటిషన్‌లు వేశారు. పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని.. హాల్ టికెట్ నంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని అభ్యర్థులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అభ్యర్థుల పిటిషన్లను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా గ్రూప్-1 పరీక్ష మళ్లీ నిర్వహించాలని హైకోర్టు టీఎస్పీఎస్సీని ఆదేశించింది.
హైకోర్టు తీర్పుపై TSPSC అప్పీల్‌కు వెళ్లనుంది. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును.. డివిజన్ బెంచ్‌లో సవాల్ చేయాలని TSPSC నిర్ణయించింది. గతంలో పేపర్ లీకేజీ కారణంగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా నిర్వహించిన పరీక్షను కూడా రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునివ్వడంతో.. అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..