Telangana Govt Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మరికొన్ని రోజుల్లో గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు..

తెలంగాణ రాష్ట్రంలో ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయాల‌ని నిర్ణయం..

Telangana Govt Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మరికొన్ని రోజుల్లో గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు..
Kcr
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Feb 18, 2022 | 11:47 AM

తెలంగాణ రాష్ట్రంలో ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్ రానుంది. అతి త్వరలోనే భారీ ఉద్యోగ ప్రకటన చేసేందుకు కసరత్తు చేస్తోంది రాష్ట్ర సర్కార్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయాల‌ని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ నెల చివ‌రి వారంలో ప‌లు ఉద్యోగాల‌కు నోటిఫికేషన్లు విడుద‌ల చేయ‌నున్నట్టు స‌మాచారం. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కేటాయింపులు, పోస్టింగ్‌లు పూర్తి కావడంతో తెలంగాణ ప్రభుత్వం త్వరలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టనుంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వచ్చే వారంలో ఈ నిర్ణయం తీసుకుని ఈ నెలాఖరులోగా తొలి నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఫేజ్ 1లో భర్తీ చేయనున్న ఖాళీల సంఖ్యను ఖరారు చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

అయితే ఇప్పటికే ప్రభుత్వ అధికారులు ప్రణాళిక‌లు కూడా రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవ‌ల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి సోమేశ్ కుమార్.. అన్ని శాఖ‌ల్లో ఉన్న ఖాళీల వివరాలన తెప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం 70 వేల వరకు పోస్టులు భర్తీ చేయాలని భావిస్తోంది. వీటిలో పోలీసు ఉద్యోగాలు 17 వేలు ఉన్నట్లుగా తెలుస్తోంది. వీటితోపాటు టీఎస్‌పీఎస్ నుంచి గ్రూప్-2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు విడుదల చేయాని అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నెలలోనే ఉద్యోగ ప్రకటనలు విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు.

తెలంగాణలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు కేసీఆర్ సర్కార్ గత కొన్ని రోజులుగా ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో కొత్త జిల్లాల వారీగా ఉద్యోగుల కేటాయింపు పూర్తయిన అనంతరం ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఇటీవల సీఎం కేసీఆర్ వెల్లడించారు. అయితే.. తాజాగా ఉద్యోగుల కేటాయింపు పూర్తి కావడంతో ఉద్యోగాల భర్తీని చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇవి కూడా చదవండి: Petrol Diesel Price: రష్యా-ఉక్రెయిన్ రచ్చ కారణంగా పెరిగిన ముడి చమురు ధరలు.. మన దేశంలో మాత్రం పెట్రోల్-డీజిల్ ధరలు ఇలా..

CM Jagan: గుంటూరు జిల్లాలో ఇస్కాన్ అక్షయపాత్ర.. ప్రారంభించనున్న సీఎం జగన్..