ICAI CA Inter 2022 Result Date: ఫిబ్రవరి 25లోపు సీఏ ఇంటర్ ఫలితాలు.. త్వరలో అధికారికంగా.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI CA) సీఏ ఇంటర్ 2021 డిసెంబర్‌ సెషన్‌ ఫలితాలను ఫిబ్రవరి 25లోపు ప్రకటించనుంది..

ICAI CA Inter 2022 Result Date: ఫిబ్రవరి 25లోపు సీఏ ఇంటర్ ఫలితాలు.. త్వరలో అధికారికంగా.
Ca Ipcc Results
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 18, 2022 | 9:55 AM

ICAI CA IPCC result 2021-22 Date: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI CA) సీఏ ఇంటర్ 2021 డిసెంబర్‌ సెషన్‌ ఫలితాలను ఫిబ్రవరి 25లోపు ప్రకటించనుంది. ఐతే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా విడుదలకాలేదు. ఫలితాల ప్రకటన అనంతరం విద్యార్ధులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ icai.org లేదా caresults.icai.orgలో తనిఖీ చేసుకోవచ్చు. కాగా ఇప్పటికే సీఏ ఫౌండేషన్, ఫైనల్‌ రిజల్ట్స్‌ ఫిబ్రవరి 10న ప్రకటించిన విషయం తెలిసిందే. సాధారణంగా సీఏ ఫౌండేషన్, ఫైనల్‌ ఫలితాలు విడుదలైన 10 నుంచి 12 రోజులకు సీఏ ఇంటర్ ఫలితాలు విడుదల చేయడం జరుగుతుంది. ఐసీఏఐ సీఏ ఇంటర్ 2021 ఫలితాల తేదీని త్వరలో ఇన్‌స్టిట్యూట్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

ICAI CA ఇంటర్‌ 2021-22 ఫలితాలు ఎలా చెక్ చేయాలంటే..

  • ముందుగా ఐసీఏఐ అధికారిక వెబ్‌సైట్ icai.nic.inను ఓపెన్‌ చెయ్యాలి.
  • హోమ్‌పేజ్‌లో ‘ICAI CA IPCC result 2021’ లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
  • వెంటనే న్యూ విండో ఓపెన్‌ అవుతుంది. రోల్ నంబర్, అవసరమైన ఇతర వివరాలను నమోదు చేసి సబ్‌మిట్‌పై క్లిక్‌ చెయ్యాలి.
  • సీఏ ఐపీసీసీ ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
  • డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్‌ఔట్ తీసుకోవాలి.

Also Read:

ICSIL Recruitment 2022: ఇంటెలిజెంట్‌ కమ్యూనికేషన్ సిస్టమ్స్‌లో ఉద్యోగావకాశాలు..ఏదైనా డిగ్రీ ఉండే చాలు..