ఆయుష్ విభాగంలో మెడికల్ ఆఫీసర్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల అయింది. మెడికల్, హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 156 మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. 156 మెడికల్ ఆఫీసర్ పోస్టులను; ఆయుర్వేదంలో 54 హోమియోలో 33 యునానిలో 69 పోస్టులు గా విభజించారు. ఆన్లైన్ ద్వారా ఈ పోస్ట్ లకు ధరకాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 7 నుండి 22వ తేదీ వరకు గడువు ఉండనుంది. వెబ్ సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకునేవారు జులై 1వ తేదీకి 18 నుండి 44 ఏళ్ల వరకు వయసు ఉండాలి.పేస్కేల్ రూ.54,220 నుంచి రూ.1,33,630 వరకు ఉంటుంది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు రూ.500 చెల్లించాలి, ప్రాసెసింగ్ ఫీజు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు ప్రాసెసింగ్ ఫీజు ఉండదు, కేవలం అప్లికేషన్ ఫీజు మాత్రమే ఉంటుంది. కేవలం తెలంగాణ రాష్ట్రానికి చెందిన దరఖాస్తుదారులకు మాత్రమే రిజిస్ట్రేషన్లకు అర్హత, ఇతర రాష్ట్రాలకు చెందిన దరఖాస్తుదారులకు రిజర్వేషన్లు వర్తించవు. ఎగ్జామ్ తేదీ, రిజల్ట్ ఈ వివరాలన్నీ త్వరలో విడుదల చేస్తారు.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.