TMC Recruitment: టాటా మెమోరియల్ సెంటర్‌లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ.. ఎవరు అర్హులంటే..
TMC Recruitment 2021, TMC Recruitment, TMC, TMC Jobs, Latest Jobs, New Jobs, Job Notification, Jobs

TMC Recruitment 2021: టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ అణు శక్తి విభాగానికి చెందిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థ అయిన టీఎంసీ.. పంజాబ్‌లో ఉన్న హోమీ హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్స్‌లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్‌లో భాగంగా టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీలు ఉన్నాయి. ఏయో విభాగాల్లో పోస్టులు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 73 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* వీటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ రేడియాలజిస్ట్, సైంటిఫిక్ ఆఫీసర్, జూనియర్ ఇంజినీర్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్, అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్, నర్సు వంటి పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా ఇంటర్మీడియట్, డిప్లొమా, జీఎన్‌ఎం, బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/ బీటెక్, మాస్టర్స్‌డిగ్రీ, సంబంధిత స్పెషలైజేషన్లలో ఎండీ/ డీఎన్‌బీ ఉత్తీర్ణత పొంది ఉండాలి.
* వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
* అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష/ ఇంటర్వ్యూ/ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ 29-11-2021తో ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం టీఎంసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి..
గర్భిణులకు హెచ్చరిక.. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే బిడ్డకి చాలా ప్రమాదం..




