హైదరాబాద్‌లో IT జాబ్స్ జాతర.. మన సిటీకి వచ్చేస్తున్న అమెరికా టెలికాం నెట్‌వర్క్ సంస్థ తొలి బ్రాంచ్!
అమెరికా ప్రముఖ టెలికాం సంస్థ టీ-మొబైల్ యూఎస్ (T-Mobile US) తన తొలి అంతర్జాతీయ టెక్నాలజీ కేంద్రాన్ని హైదరాబాద్‌లో స్థాపిస్తోంది. అమెరికా వెలుపల ఏర్పాటు అవుతున్న ఈ గ్లోబల్ టెక్నాలజీ హబ్ ద్వారా ఈ సంస్థ భారతదేశంలో తన సాంకేతిక కార్యకలాపాలను విస్తరించనుంది. ఈ కేంద్రం 2026 ప్రారంభంలో అధికారికంగా..

మేడ్చల్, నవంబర్ 13: అమెరికా ప్రముఖ టెలికాం సంస్థ టీ-మొబైల్ యూఎస్ (T-Mobile US) తన తొలి అంతర్జాతీయ టెక్నాలజీ కేంద్రాన్ని హైదరాబాద్‌లో స్థాపిస్తోంది. అమెరికా వెలుపల ఏర్పాటు అవుతున్న ఈ గ్లోబల్ టెక్నాలజీ హబ్ ద్వారా ఈ సంస్థ భారతదేశంలో తన సాంకేతిక కార్యకలాపాలను విస్తరించనుంది. ఈ కేంద్రం 2026 ప్రారంభంలో అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది.
హైదరాబాద్‌పై టీ-మొబైల్ ఫోకస్
టీ-మొబైల్ యూఎస్ ఈ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణాలు.. అత్యున్నత నైపుణ్యం కలిగిన టాలెంట్ పూల్, అధునాతన మౌలిక సదుపాయాలు. అలాగే వ్యాపారానికి అనుకూలమైన పర్యావరణం ఇక్కడ ఉన్నట్లు పేర్కొంది. హైదరాబాద్ ఇప్పటికే గ్లోబల్ ఐటీ సంస్థలకు కేంద్రంగా ఎదుగుతుండగా, టీ-మొబైల్ స్థాపనతో ఈ ప్రాధాన్యత మరింత పెరగనుంది.
ప్రారంభ దశలో 300 ఉద్యోగాలు
సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. తొలి దశలో 300 మందికిపైగా నిపుణులను నియమించనుంది. వీరిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, డెవ్‌ఓప్స్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ రంగాలకు సంబంధించిన నిపుణులు ఉంటారు. ఈ హబ్ పూర్తిగా డిజిటల్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, ఆపరేషనల్ ఎఫిషియెన్సీ పెంపుపై దృష్టి సారించనుంది. హైదరాబాద్‌లోని ఈ గ్లోబల్ సెంటర్ ద్వారా టీ-మొబైల్ తన నెట్‌వర్క్ అంతటా కస్టమర్ అనుభవం, ఆపరేషన్ల సామర్థ్యాన్ని మెరుగుపరచే డిజిటల్ సొల్యూషన్లు అభివృద్ధి చేయనుంది. కస్టమర్లకు వేగవంతమైన సేవలు, అధునాతన డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లు అందించడంలో ఈ హబ్ కీలక పాత్ర పోషించనుంది.
గ్లోబల్ ఐటీ మ్యాప్‌లో హైదరాబాద్
ఇటీవల కాలంలో హైదరాబాద్ వేదికగా మెక్‌డొనాల్డ్, హైనీకెన్, వాన్గార్డ్, ఎలీ లిల్లీ, సాఫ్రాన్ వంటి గ్లోబల్ దిగ్గజాలు తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCs) ఏర్పాటు చేయగా, ఇప్పుడు టీ-మొబైల్ కూడా అదే దారిలో అడుగులు వేస్తోంది. ఈ కేంద్రం ప్రారంభంతో రాష్ట్ర ఐటీ రంగానికి కొత్త ఉత్సాహాన్ని తెచ్చి, హైదరాబాద్ గ్లోబల్ టెక్నాలజీ మ్యాప్‌లో మరింత కీలక స్థానాన్ని సంపాదించనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్‌లో వరుసగా గ్లోబల్ టెక్ సంస్థలు స్థాపనతో, నగరం ఇప్పుడు భారత్ నూతన డిజిటల్ రాజధానిగా రూపుదిద్దుకుంటున్నారు ఐటీ ఎక్స్‌పర్ట్స్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




