SSC Delhi Police recruitment notification 2022: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ రేపు (జూలై 8న) విడుదలకానుంది. దాదాపు 1215 పోలీస్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం (కొత్త నోటిఫికేషన్‌లో పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది). ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభ్యర్ధులకు ఎస్సెస్సీ రూపొందించిన రీషెడ్యూల్ ప్రకారం శుక్రవారం వివరణాత్మక నోటిఫికేషన్ విడుదలకానుంది. కానిస్టేబుల్ (డ్రైవర్), హెడ్ కానిస్టేబుల్ (AWO/TPO) పోస్టులను ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్-2022 (రాత పరీక్ష) ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హతలు, ఏయే పోస్టులకు ఎన్ని ఖాళీలున్నాయి, ఎంపిక విధానం వంటి సమాచారం నోటిఫికేషన్‌లో తనిఖీ చేసుకోవచ్చు. ప్రకటన వెలువడిన అనంతరం ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అడ్మినిస్ట్రేటివ్ కారణాల రిత్యా నోటిఫికేషన్ విడుదల వాయిదా పడిందని, జులై 8న అధికారిక నోటిఫకేషన్ ప్రకటిస్తామని ఈ సందర్భంగా ఎస్సెస్సీ తెల్పింది. ఇతర పూర్తి వివరాల కోసం కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
కాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ క్యాలెండర్ 2022-23 ప్రకారం.. ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్-2022 కానిస్టేబుల్ (డ్రైవర్) రిక్రూట్‌మెంట్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 27 నుంచి జూలై 26 వరకు కొనసాగుతుందని షెడ్యూల్‌లో పేర్కొంది. హెడ్ కానిస్టేబుల్స్ (AWO) రిక్రూట్‌మెంట్‌కు నిర్వహించే ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్-2022 /TPO పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి జూలై 4 నుంచి ఆగస్టు 3 వరకు షెడ్యూల్ చేయబడింది. ఐతే కొన్ని కారణాల వల్ల సకాలంలో ఎస్సెస్సీ నోటిఫికేషన్లను విడుదల చేయలేదు. ఆయా తేదీలను రీషెడ్యూల్ చేసి జులై 8న అధికారిక నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నట్లు కమిషన్ ప్రకటించింది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.