SSC Revised Final Result 2025: పోలీస్ SI, సీఏపీఎఫ్ పరీక్షల తుది ఫలితాల్లో స్వల్ప మార్పులు.. కొత్త సెలక్షన్ లిస్ట్ ఇదే
కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సబ్-ఇన్‌స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్) 2024 పోస్టులకు సంబంధించి తుది ఫలితాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు సవరించిన ఫలితాలను తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్ నెలలో ప్రకటించిన..

అమరావతి, నవంబర్ 26: కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సబ్-ఇన్‌స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్) 2024 పోస్టులకు సంబంధించి తుది ఫలితాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు సవరించిన ఫలితాలను తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్ నెలలో ప్రకటించిన ఫలితాల్లో లోపాలున్నట్లు పలు అభ్యర్థనలు రావడంతో కమిషన్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో పరీక్ష రాసిన అభ్యర్థులకు సంబంధించిన తుది ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సవరించింది. సవరించిన ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఢిల్లీ పోలీసు విభాగంతో పాటు కేంద్ర సాయుధ బలగాలైన సీఏపీఎఫ్, బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీలో మొత్తం 4,187 సబ్-ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
ఐబీఎం, నాస్కామ్ ఫౌండేషన్ ద్వారా సాంకేతిక నైపుణ్యాలపై పేద యువతకు ఉచిత శిక్షణ
మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా పరిశ్రమలకు అవసరమైన ఆధునాతన సాంకేతిక నైపుణ్యాలపై పేద విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ఐబీఎంతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు నాస్కామ్ ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. మొత్తం 87 వేల మందికి పైగా యువతకు కృత్రిమ మేధ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్ వంటి సాంకేతిక కోర్సులపై ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఐబీఎం స్కిల్ బిల్డ్ ప్రోగ్రామ్ కింద ఈ ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్ధులకు మెంటార్‌షిప్, సాంకేతిక నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడానికి అనుభవం కలిగిన వారితో మార్గదర్శకాలను అందిస్తుంది. అలాగే వృత్తి పరమైన స్కిల్స్ కూడా నేర్పించడం ఇందులో ఉంటాయని తెలిపింది. ఇందుకుగానూ నేరుగా యూనివర్సిటీలతో పాటు ఆధునిక సాంకేతికతల్లో నైపుణ్యాలు నేర్పేవారితోనూ భాగసామ్యం చేసుకుని శిక్షణ ఇవ్వనున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.








