AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుట్టుక మన భవిష్యత్తును ఎంతవరకు ప్రభావితం చేస్తుంది..?

మనిషి భవిష్యత్తును కేవలం కష్టం, ప్రతిభ మాత్రమే నిర్ణయిస్తాయా? లేక పుట్టిన కుటుంబం, తల్లిదండ్రుల ఆదాయం, విద్యా సదుపాయాలు, నివసించే ప్రాంతం కూడా కీలక పాత్ర పోషిస్తాయా? భారతదేశంలో సామాజిక, ఆర్థిక చలనశీలతపై అధ్యయనాలు పేద కుటుంబాల పిల్లలు ఎదుర్కొనే అడ్డంకులను వెల్లడిస్తున్నాయి.

పుట్టుక మన భవిష్యత్తును ఎంతవరకు ప్రభావితం చేస్తుంది..?
Social Mobility In India
Santosh Nair
| Edited By: |

Updated on: Oct 27, 2026 | 11:44 AM

Share

మనిషి భవిష్యత్తును కేవలం కష్టం, ప్రతిభ మాత్రమే నిర్ణయిస్తాయా? లేక పుట్టిన కుటుంబం, తల్లిదండ్రుల ఆదాయం, విద్యా సదుపాయాలు, నివసించే ప్రాంతం కూడా కీలక పాత్ర పోషిస్తాయా? భారతదేశంలో సామాజిక, ఆర్థిక చలనశీలతపై అధ్యయనాలు పేద కుటుంబాల పిల్లలు ఎదుర్కొనే అడ్డంకులను వెల్లడిస్తున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అవకాశాల వ్యత్యాసం, తండ్రి వృత్తి పిల్లల కెరీర్‌పై చూపే ప్రభావం సమాన అవకాశాలపై చర్చకు దారితీస్తున్నాయి.

రూపాయి ఆదాయం లేని బీహార్‌లోని ఒక గ్రామీణ బాలుడు, బెంగళూరులోని ఓ మధ్యతరగతి లేదా ఉన్నత వర్గ బాలుడు.. ఇద్దరికీ చిన్నతనం నుంచీ పెద్దలు చెప్పే మాట ఒకటే.. “కష్టపడి చదివితే ప్రతిభకు తగిన స్థానం లభిస్తుంది, కష్టమే మనిషి భవిష్యత్తును మారుస్తుంది.”.. ఈ ఇద్దరు పిల్లలు సమానమైన కష్టాన్ని, శ్రమను ధారపోసినప్పటికీ.. వారు తమ జీవితంలో చేరుకునే స్థానాలు మాత్రం ఎప్పటికీ సమానంగా ఉండటం లేదు. వ్యక్తిగత ప్రతిభ, కష్టపడే తత్వం గురించి సమాజం మాట్లాడే మాటలకు.. మన దేశంలోని ఆర్థిక నిరాశాజనక వాస్తవ గణాంకాలకు నడుమ చాలా పెద్ద వ్యత్యాసం ఉంది.

పుట్టుకే భవిష్యత్తుకు ప్రామాణికమా? – అధ్యయనాల నిజాలు:

తరతరాల ఆర్థిక మార్పులపై (Intergenerational Mobility) పరిశోధన చేసే ఆర్థికవేత్తల డేటా ప్రకారం.. భారతదేశంలో పేదరికంలో (దిగువన ఉన్న 20 శాతం కుటుంబాలలో) జన్మించిన పిల్లలలో కేవలం 3 శాతం మంది మాత్రమే తమ జీవితకాలంలో ఉన్నత స్థాయికి (ఎగువ 20 శాతానికి) చేరుకోగలుగుతున్నారు.

పేదరికపు చక్రవ్యూహం: ఆ పేదరికంలో పుట్టిన పిల్లల్లో ఏకంగా 52 శాతం మంది తమ జీవితాంతం ఆ పేదరికం నుంచి బయటకు రా లేక అక్కడే ఉండిపోతున్నారు.

ఉన్నత వర్గాల భద్రత: మరోవైపు, సంపన్న కుటుంబాలలో (ఎగువ 20 శాతంలో) జన్మించిన పిల్లల్లో 54 శాతం మంది తమ ఆర్థిక స్థాయి తగ్గకుండా అదే స్థానంలో కొనసాగుతున్నారు.

ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్న నిజం ఏమిటంటే.. ఒక వ్యక్తి ఎంత కష్టపడ్డాడనే దానికంటే, అతను “ఏ కుటుంబంలో జన్మించాడు” అనేదే అతని భవిష్యత్తును అధికంగా నిర్ణయిస్తోంది.

అంతర్జాతీయ స్థాయి పోలిక – ‘వేజ్ ఎలాస్టిసిటీ’:

తండ్రి ఆదాయం ఆధారంగా కొడుకు సంపాదన ఎంతవరకు ఆధారపడి ఉందో కొలిచే ఆర్థిక సూచికను Intergenerational Wage Elasticity అంటారు. ఇందులో ‘0’ (సున్నా) ఉంటే పుట్టుకతో సంబంధం లేకుండా అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయని, ‘1’ ఉంటే అవకాశాలు శూన్యమని అర్థం.

దేశం / వర్గం పరస్పర ఆధారిత స్కోరు (Intergenerational Elasticity)

ఒఇసిడి (OECD) సంపన్న దేశాల సగటు – 0.38 అమెరికా (USA) – 0.40 చైనా (China) – 0.50 భారతదేశం (SC/ST వర్గాలు) – 0.55 భారతదేశం (ఇతర వర్గాలు)-  0.61

భారతదేశ స్కోరు (0.61) అభివృద్ధి చెందిన దేశాలకంటే మాత్రమే కాకుండా, ఆర్థిక వృద్ధిలో మనతో పోటీపడే చైనా కంటే కూడా చాలా వెనుకబడి ఉంది. అంటే మన దేశంలో పుట్టుకనేది ఒకరి ఆర్థిక స్థితిని మార్చడానికి పెద్ద అవరోధంగా మారుతోంది.

తండ్రి ఉద్యోగం – కొడుకు భవిష్యత్తు:

1984లో జన్మించిన వారిపై జరిపిన అధ్యయనం ప్రకారం..

వైట్ కాలర్ ఉద్యోగాలు (White-Collar Jobs): ఆఫీసు ఉద్యోగాలు చేసే తండ్రుల పిల్లల్లో 39.3 శాతం మంది అదే స్థాయి వైట్ కాలర్ ఉద్యోగాల్లోకి వెళ్లారు.

నైపుణ్యం లేని కార్మికులు & రైతులు: నైపుణ్యం లేని కూలీల పిల్లలలో కేవలం 4.9 శాతం, రైతుల పిల్లలలో కేవలం 6.4 శాతం మంది మాత్రమే వైట్ కాలర్ ఉద్యోగాలను సాధించగలిగారు.

పేదరిక వారసత్వం: నైపుణ్యం లేని పనులు చేసే కుటుంబాల్లో పుట్టిన పిల్లలలో 58.5 శాతం మంది మళ్లీ అవే పనుల్లో స్థిరపడాల్సి వచ్చింది. ఇది వ్యక్తిగత ఎంపిక కాదు, తరతరాలుగా కొనసాగుతున్న ఒక సామాజిక నిర్మాణం.

ప్రాంతం – వలసల ప్రభావం:

గ్రామీణ ప్రాంత వ్యవసాయ కుటుంబాల పిల్లలలో కేవలం 10.5 శాతం మంది మాత్రమే క్లరికల్ లేదా తత్సమాన ఉద్యోగాలకు మారగా, నగరాల్లోని అదే స్థాయి పిల్లలలో 26.8 శాతం మంది ఆ ఉద్యోగాలు సాధించగలిగారు. అంటే ఒకరి ఆర్థిక అవకాశాలను వారుండే “పిన్ కోడ్” (ప్రాంతం) నిర్ణయిస్తోంది.

నగరంలో పెరిగే పిల్లాడికి మంచి పాఠశాలలు, ఇంగ్లీష్ పరిజ్ఞానం, ఆఫీసుల్లో పనిచేసే బంధువుల మార్గదర్శకత్వం అందుతాయి. కానీ గ్రామీణ పిల్లాడికి సరైన బడి, మార్గదర్శకులు అందుబాటులో ఉండవు. ఎంత శ్రమించినా ఈ ఇద్దరి ప్రారంభ స్థానాల్లో ఉన్న వ్యత్యాసమే వారి భవిష్యత్తును వేరు చేస్తోంది.

అంతేకాక, భారతదేశంలో అంతర్గత వలసలు (Internal Migration) చాలా తక్కువగా ఉన్నాయి. కేవలం 14.7 శాతం మంది మాత్రమే ఉపాధి కోసం వలస వెళ్తున్నారు. మహిళల్లో ఈ సంఖ్య కేవలం 2 శాతమే ఉంది.

పౌరుడిగా మనం ఆలోచించాల్సింది:

శ్రమ, ప్రతిభ, ఆశయాలు ఇవన్నీ ఖచ్చితంగా ము ముఖ్యమే. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే.. ఒక వ్యక్తి ఏ గ్రామంలో, ఏ పేద కుటుంబంలో జన్మించినప్పటికీ.. అతనిలోని ప్రతిభ గమ్యాన్ని చేరుకోవడానికి మన విద్యా వ్యవస్థ, రవాణా, మౌలిక వసతుల విధానాలు అనుకూలంగా ఉన్నాయా? ఆ ప్రతిభకు తగిన అవకాశాల రహదారిని మన దేశం కల్పిస్తోందా? లేదా? అని ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది!

Follow Us
పుట్టుక మన భవిష్యత్తును ఎంతవరకు ప్రభావితం చేస్తుంది?
పుట్టుక మన భవిష్యత్తును ఎంతవరకు ప్రభావితం చేస్తుంది?
విరేచనాలు అయినప్పుడు పొడి టీ ఆకులు తింటే నిజంగానే తగ్గుతాయా?
విరేచనాలు అయినప్పుడు పొడి టీ ఆకులు తింటే నిజంగానే తగ్గుతాయా?
మీతో మాట్లాడినవారు మిమ్మల్ని మర్చిపోకూడదా? చిన్న సైకాలజీ ట్రిక్
మీతో మాట్లాడినవారు మిమ్మల్ని మర్చిపోకూడదా? చిన్న సైకాలజీ ట్రిక్
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి సూపర్ న్యూస్.. ఇంకంటే మంచి ఛాన్స్ దొరకదు.
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి సూపర్ న్యూస్.. ఇంకంటే మంచి ఛాన్స్ దొరకదు.
అప్పులు వదిలించుకునేందుకు కన్నతల్లినే కడతేర్చిన ఉన్మాద కొడుకు..
అప్పులు వదిలించుకునేందుకు కన్నతల్లినే కడతేర్చిన ఉన్మాద కొడుకు..
కమెడియన్ అలీ జీవితంలో ఎవరికీ తెలియని సీక్రెట్
కమెడియన్ అలీ జీవితంలో ఎవరికీ తెలియని సీక్రెట్
వైభవ్ సూర్యవంశీ కోసం టీమిండియా ప్లాన్ మారుతుందా?
వైభవ్ సూర్యవంశీ కోసం టీమిండియా ప్లాన్ మారుతుందా?
దీపావళికి గోల్డ్ కొనేవారికి నిరాశ.. మళ్లీ పెరిగిన ధరలు..
దీపావళికి గోల్డ్ కొనేవారికి నిరాశ.. మళ్లీ పెరిగిన ధరలు..
దీపావళికి బెస్ట్ లడ్డూ.. ఈ స్వీట్ తిన్నా షుగర్ పెరగదు..
దీపావళికి బెస్ట్ లడ్డూ.. ఈ స్వీట్ తిన్నా షుగర్ పెరగదు..
ఆ సినిమా తర్వాత నా మీద నెగిటివిటీ పెరిగింది..
ఆ సినిమా తర్వాత నా మీద నెగిటివిటీ పెరిగింది..