SIDBI Recruitment: సిడ్బీలో అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ పోస్టులు.. అర్హులు ఎవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సిడ్బీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. లక్నోలోని క్యారాలయంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు...
స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సిడ్బీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. లక్నోలోని క్యారాలయంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పరీక్ష కేంద్రాలను తెలుగు రాష్ట్రాల్లోనూ ఏర్పాటు చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమవుతోన్న నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బ్యాచిలర్స్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ/ పీజీ డిగ్రీ(కామర్స్/ ఎకనామిక్స్/ మేనేజ్‌మెంట్)/ సీఏ/సీఎస్/ సీడబ్ల్యూఏ/ సీఎఫ్‌ఏ/ సీఎంఏ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 14-12-2022న ప్రారంభమవుతుండగా 03-01-2022తో ముగియనుంది.
* అభ్యర్థులను ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్ పరీక్షను వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలను 2023 ఫిబ్రవరిలో చేపట్టనున్నారు.
* తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, రాజమండ్రి, గుంటూరు, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..