డిగ్రీతో రూ.22 లక్షల జీతంతో SBIలో భారీగా ఉద్యోగాలు.. కెరీర్‌కు బంపర్ ఛాన్స్! వెంటనే అప్లై చేయండి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) దేశవ్యాప్తంగా 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న అభ్యర్థులు జులై 8, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ దశల ద్వారా ఎంపిక జరగనుండగా, ఎంపికైన వారికి ఏడాదికి సుమారు రూ.22 లక్షల వేతన ప్యాకేజీతో పాటు ఆకర్షణీయమైన కెరీర్ అవకాశాలు లభించనున్నాయి..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ).. దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 1500 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయసు ఏప్రిల్ 1, 2026 నాటికి 21 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి. అంటే ఏప్రిల్ 2, 1996 నుంచి ఏప్రిల్ 1, 2005 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు కేటగిరీకి 10 నుంచి 15 ఏళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూ.. మూడు దశల్లో నియామకాలుంటాయి. ఎంపికై వారు ఏడాదికి సుమారు రూ.22 లక్షల వేతనంతో కొలువు సొంతం చేసుకోవచ్చు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికీ చేరుకోవచ్చు. అలాగే ఆకర్షణీయమైన ఇంక్రిమెంట్లు, ప్రోత్సాహకాలు, అలవెన్సులూ అందుతాయి. విదేశాల్లోనూ శాఖలు ఉండటం వల్ల అక్కడా పని చేసే అవకాశం దక్కుతుంది. అందుకే ఈ పోస్టులకు పోటీ కాస్త ఎక్కువగానే ఉంటుంది. పైగా జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు SBIలో పీవో పోస్టులకు గరిష్ఠ వయసులోగా 6 సార్లు మాత్రమే రాయడానికి అనుమతి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన అభ్యర్ధులు ఎన్ని సార్లైనా రాసుకోవచ్చు. ఈ నియామక ప్రక్రియలో మొత్తం 3 దశలు ఉంటాయి.
ఎస్బీఐ పీవో పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నియామక విధానం ఎలా ఉంటుందంటే..
ఫేజ్ 1 (ప్రిలిమినరీ) పరీక్ష
ఈ పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్‌లైన్‌లో 100 మార్కులకు 100 ప్రశ్నలకు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు చొప్పున కోత విధిస్తారు. పరీక్షకు ఒక గంట వ్యవధి ఉంటుంది. మొత్తం 3 విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 40, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 30, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 30 ప్రశ్నలు వస్తాయి. సెక్షన్ల వారీ కటాఫ్ మార్కులు ఉండవ్. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారిని కేటగిరీలవారీ ఖాళీలకు పది రెట్ల మందిని మెయిన్ ఎంపిక చేస్తారు. అంటే మొత్తం 15 వేల మందికి మెయిన్స్ రాసే అవకాశం దక్కుతుంది.
ఫేజ్ 2 లో మెయిన్ పరీక్ష
ఫేజ్ 2 లో మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్ పరీక్ష డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో ఈ మెయిల్స్, సిచ్యువేషన్ అనాలిసిస్, రిపోర్ట్ రైటింగ్/ప్రెసీ ఒక్కో విభాగం నుంచీ 2 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ప్రతి విభాగంలోనూ ఒకటి రాస్తే సరిపోతుంది. ఇంటర్వ్యూ దశకు ఎంపిక కావడానికి కేటగిరీలవారీ ఖాళీలకు 3 రెట్ల మందిని మెయిన్స్ మార్కుల మెరిట్ ప్రకారం తీసుకుంటారు. సెక్షన్ల వారీ బ్యాంకు నిర్దేశించిన కటాఫ్ మార్కులు పొందడం తప్పనిసరి. ఇలా 4500 మందికి అవకాశం దక్కుతుంది.
ఫేజ్ 3లో ఇంటర్వ్యూ
ఆ తర్వాత ఫేజ్ 3ల్లో సాధించిన మార్కులతో తుది నియామకాలు చేపడతారు. ఫేజ్ 2లో 230 మార్కులను 75కు, ఫేజ్ 3లో 50 మార్కులను 25కి కుదిస్తారు. అంటే 100 మార్కులను స్కేల్‌గా తీసుకుని తుది ర్యాంకులను కేటాయిస్తారు. మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారు విధుల్లో చేరిన తర్వాత తప్పనిసరిగా మూడేళ్లు కొనసాగవల్సి ఉంటుంది. ఇందుకోసం రూ.2 లక్షల విలువైన ఒప్పంద పత్రాన్ని ప్రతి ఒక్కరూ యాజమన్యానికి సమర్పించాల్సి ఉంటుంది.
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జులై 8, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలు రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు ఉండదు. ఫేజ్ 1 ప్రిలిమినరీ పరీక్షలు ఆగస్టులో, ఫేజ్ 2 మెయిన్ పరీక్ష సెప్టెంబరులో, ఫేజ్ 3 సైకోమెట్రిక్ టెస్టు, గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ.. అక్టోబరు లేదా నవంబరులో ఉంటాయి.
ఎస్బీఐ పీవో పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




