AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 5583 ఉద్యోగాలకు ఎస్బీఐ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025-26 ఆర్థిక సంవత్సరానికి 5,583 జూనియర్ అసోసియేట్స్ రిక్రూట్‌మెంట్ ప్రారంభించింది. ఆగస్టు 6 నుండి ఆగస్టు 26 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ వర్క్‌ఫోర్స్‌ను బలోపేతం చేయడం, సేవలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ నియామక డ్రైవ్ ప్రారంభించింది.

SBI: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 5583 ఉద్యోగాలకు ఎస్బీఐ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే..
Sbi Jo Recruitment
Krishna S
|

Updated on: Aug 06, 2025 | 8:49 PM

Share

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే.. ఇది మీకోసమే. బ్యాంక్ జాబ్స్ కోసం ఎదురుచూసేవారు.. అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులో చేరడానికి ఒక సువర్ణావకాశం ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ రిక్రూట్‌మెంట్‌కు సిద్ధమైంది. ఎస్బీఐ తన కస్టమర్ సేవను బలోపేతం చేయడానికి, తన వర్క్‌ఫోర్స్‌ను విస్తరించడానికి 5,583 జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఆన్‌లైన్ అప్లికేషన్ల ప్రాసెస్ కూడా ప్రారభమైంది. ఆగస్టు 6 నుండి ఆగస్టు 26 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కొన్ని నెలల క్రితం 505 ప్రొబేషనరీ ఆఫీసర్లు, 13,455 జూనియర్ అసోసియేట్‌లను నియమించిన తర్వాత ఎస్బీఐ ఈ నియామక ప్రక్రియను ప్రారంభించింది. దాని విస్తృత బ్రాంచ్‌లు, నెట్‌వర్క్‌లో కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, సేవలను మెరుగుపరచడం బ్యాంక్ లక్ష్యం. 2.36 లక్షలకు పైగా ఉద్యోగులతో ఎస్బీఐ బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద ఉద్యోగ కల్పనలలో ఒకటి. కొత్తగా నియమించబడిన ఉద్యోగులను వివిధ ప్రదేశాలలో నియమిస్తారు. ఇది కస్టమర్లతో మెరుగైన కమ్యూనికేషన్, ఫిర్యాదుల త్వరిత పరిష్కారం, ఈజీ బ్యాంకింగ్ వంటి వాటికి ఉపయోగపడనుంది.

ప్రతిభావంతులైన యువతకు..

ఈ నియామక డ్రైవ్ బ్యాంకు యొక్క దీర్ఘకాలిక వ్యూహానికి అనుగుణంగా ఉందని ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి నొక్కి చెప్పారు. మానవ వనరుల సామర్థ్యాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా దీనిని చేపట్టినట్లు తెలిపారు. ప్రతిభావంతులైన యువతను ఎస్బీఐతో అనుసంధానించడం తమ ప్రాధాన్యత అని తెలిపారు. మారుతున్న బ్యాంకింగ్ అవసరాలకు అనుగుణంగా వారు మారగలిగేలా స్కిల్స్‌ అభివృద్ధికి సహాయం చేస్తామన్నారు.

ఎస్బీఐ సామ్రాజ్యం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోనే అతిపెద్ద వాణిజ్య బ్యాంకు. 22,937 శాఖలు, 63,791 ATMలు ఉన్నాయి. మార్చి 2025 నాటికి బ్యాంక్ డిపాజిట్ బేస్ రూ. 53.82 లక్షల కోట్లకు పైగా ఉండగా, దాని లోన్ పోర్ట్‌ఫోలియో రూ. 42.20 లక్షల కోట్లకు పైగా ఉంది. దేశంలో హోమ్ లోన్స్ అందించే అతిపెద్ద సంస్థలలో ఎస్బీఐ ఒకటి. దీని డిజిటల్ ప్లాట్‌ఫామ్ YONO 8.77 కోట్లకు పైగా నమోదిత వినియోగదారులను కలిగి ఉంది.

దరఖాస్తు ప్రక్రియ

స్థానం: జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) ఖాళీలు: 5,583 దరఖాస్తు తేదీ: ఆగస్టు 6 నుండి ఆగస్టు 26, 2025

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..