RPF SI 2025 Physical Events: ఆర్‌పీఎఫ్ ఎస్సై పోస్టులకు దేహదారుఢ్య పరీక్షలు.. పూర్తి షెడ్యూల్ ఇదే
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి సంబంధించి శారీరక సామర్థ్య పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లకు సంబంధించిన తాత్కాలిక తేదీలను ఆర్‌పీఎఫ్ విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం..

హైదరాబాద్, జూన్ 4: కేంద్ర రైల్వే శాఖ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి సంబంధించి శారీరక సామర్థ్య పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లకు సంబంధించిన తాత్కాలిక తేదీలను ఆర్‌పీఎఫ్ విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం జూన్ 22 నుంచి జులై 02 వరకు ఫిజికల్ ఈవెంట్స్ జరగనున్నాయి. రాత పరీక్షలో షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్ధుల పేర్ల వారీగా పీఈటీ, పీఎంటీ, డీవీ తేదీలతోపాటు కావల్సిన ధ్రువపత్రాలను షెడ్యుల్‌కు రెండు వారాల ముందుగా అభ్యర్థుల రిజిస్టర్డ్ ఈమెయిల్, మొబైల్‌లకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా నోటిఫికేషన్ అందిస్తామని రైల్వే బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.
కాగా ఈ ఏడాది మార్చి నెలలో ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్‌కు ఎంపికైన అభ్యర్థుల వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచిన సంగతి తెలిసిందే. ఫలితాలతో పాటు కట్ ఆఫ్ మార్కులను కూడా జారీ చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో మొత్తం 452 సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు ఈ నియామక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఆర్‌ఆర్‌బీ ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక గత ఏడాది డిసెంబర్ 2, 3, 9, 12, 13 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించారు.
ఆర్‌ఆర్‌బీ ఆర్‌పీఎఫ్ ఎస్సై ఈవెంట్స్ 2025 షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో మొత్తం 4,660 కానిస్టేబుళ్లు, ఎస్ఐ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్ లైన్ లో సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో రాత పరీక్ష నిర్వహించారు. ఇందులో షార్ట్ లిస్ట్ చేసిన వారిని దేహదారుఢ్య పరీక్షలకు పిలుస్తారు. తొలుత 452 ఎస్సై పోస్టులకు ఈవెంట్స్ నిర్వహించనున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




