Railway News/ IRCTC: రైల్వే విభాగాల్లోని పలు పోస్టుల కోసం రైల్వే నియామక సంస్థ (RRB) ఎన్టీపీసీ పరీక్షలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో పరీక్ష రాసే అభ్యర్థుల సౌలభ్యం కోసం ప్రత్యేక రైళ్లు నడపాలని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాల నుంచి నడిచే ప్రత్యేక రైళ్ల జాబితాను దక్షిణ మధ్య రైల్వే అధికారులు విడుదల చేశారు. ఆయా రైళ్లను నడిపే తేదీలతో పాటు బయల్దేరే వేళలు, ఏయే స్టేషన్లలో ఆగుతాయి వంటి వివరాలను ఇందులో పేర్కొన్నారు. పూర్తి వివరాలిలా ఉన్నాయి. 08615 నంబర్ గల రైలు జూన్ 10 (శుక్రవారం) న రాత్రి 11.55 గంటలకు హతియా స్టేషన్ నుంచి బయలుదేరి ఆదివారం ఉదయం 11.30 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ చేరుకుంటుంది. అదేవిధంగా 08616 నంబర్ గల రైలు జూన్ 13 (సోమవారం) న రాత్రి 7.30 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. బుధవారం ఉదయం 6 గంటలకు హతియా స్టేషన్‌కు చేరుకుంటుంది.
ఈ స్పెషల్ ట్రైన్స్ రూర్కెలా, జర్సుగూడ, సంబల్‌పూర్ సిటీ, అంగుల్, కటక్, భువనేశ్వర్, ఖుర్దా రోడ్, బుల్‌గావ్, ఛత్రాపూర్, బ్రహ్మపూర్, పలాస, శ్రీకాకుళం రోడ్, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూర్ స్టేషన్లలో ఆగుతుంది. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ-2టైర్, ఏసీ-3టైర్, స్లీపర్‌క్లాస్, జనరల్ కోచ్‌లతో పాటు సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉన్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
Hatia – Secunderabad – Hatia RRB Examination Specials@VijayawadaSCR @drmsecunderabad @drmhyb pic.twitter.com/T2N8ukHKNW
— South Central Railway (@SCRailwayIndia) June 6, 2022
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read:
భారతదేశంలో ప్రారంభమైన Moto E32S విక్రయాలు.. ధరలు, ఫీచర్ల తదితర వివరాలివే..