RRB Railway Jobs 2025: రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల.. రేపట్నుంచే దరఖాస్తులు ప్రారంభం
RRB JE 2025 Recruitment Notification: దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్లలో ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 31వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఇతర వివరాల ఈ కింద చెక్ చేసుకోండి..

దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్లలో ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 2,569 జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 31వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఇతర వివరాల ఈ కింద చెక్ చేసుకోండి..
అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్‌పూర్, జమ్ము & శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం ఆర్‌ఆర్‌బీ రీజియన్లతో ఆ పోస్టులను భర్తీ చేయనుంది. జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో డిప్లొమా (ఇంజినీరింగ్), బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే వయోపరిమితి జనవరి 1, 2026 నాటికి తప్పనిసరిగా 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 30, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టేజ్-1, స్టేజ్-2 ఆన్‌లైన్ రాత పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, రైల్వే మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
పరీక్ష విధానం ఇలా..
మొత్తం 100 మార్కులకు 100 అబ్జెక్టీవ్ ప్రశ్నలకు ఈ పరీక్ష ఉంటుంది. గణితం నుంచి 30 ప్రశ్నలకు 30 మార్కులు, జనరల్ ఇంటలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలకు 25 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ నుంచి 15 ప్రశ్నలకు 15 మార్కులు, జనరల్ సైన్స్ నుంచి 30 ప్రశ్నలకు 30 మార్కుల చొప్పున ప్రశ్నలు వస్తాయి. వ్యవధి 90 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 1/3 చొప్పున మార్కుల కోత విధిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారిని స్టేజ్ 2 పరీక్షకు అనుమతిస్తారు.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




