ఆ పోస్టుల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైతే ఆర్‌టీఐ చట్టం ఉద్దేశం దెబ్బతిన్నట్లే: సుప్రీంకోర్టు
దేశ వ్యాప్తంగా ఉన్న పలు రాష్ట్రాల్లో సమాచార హక్కు కమిషన్లలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆదేశించారు. వివిధ కమిషన్లలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీచేసేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి విచారించారు. ఈ క్రమంలో ప్రముఖ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ప్రస్తుతం ఉన్న స్థితిగతుల గురించి సుప్రీంకోర్టు ధర్మాసనం..

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: దేశ వ్యాప్తంగా ఉన్న పలు రాష్ట్రాల్లో సమాచార హక్కు కమిషన్లలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆదేశించారు. వివిధ కమిషన్లలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీచేసేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి విచారించారు. ఈ క్రమంలో ప్రముఖ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ప్రస్తుతం ఉన్న స్థితిగతుల గురించి సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
కేంద్ర సమాచార కమిషన్‌లో ప్రస్తుతం 4 పోస్టులు భర్తీ అయ్యాయని, ఇంకా 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన వివరించారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించిన భారీ చార్ట్‌ను ప్రశాంత్ భూషణ్ ధర్మాసనానికి సమర్పించారు. 2019 ఫిబ్రవరి 15వ తేదీన సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలను ఏ విధంగా దెబ్బతీస్తుందో వివరించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కేంద్ర సమాచార కమిషన్‌కు సంబంధించి నలుగురు కమిషనర్లు మాత్రమే పనిచేస్తున్నారన్నారు. వారు కూడా పదవీ విరమణ చేస్తే మొత్తం కమిషనే పనిచేయని పరిస్థితి తలెత్తుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
దీంతో అందువల్ల కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఖాళీల జాబితాను తయారు చేయాలని కోర్టు ఆదేశించింది. అన్ని రాష్ట్రాలూ తమ పరిధిలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని, మూడు వారాల తర్వాత తదుపరి విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. తెలంగాణ, త్రిపురల్లోని కమిషన్లు పూర్తిగా నిరుపయోగంగా ఉన్నట్లు ప్రశాంత్ భూషణ్ ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. జార్ఖండ్ కమిషన్‌లో 2019 మే నుంచి దాదాపు 11 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. సీజేఐ ఖాళీల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైతే ఆర్‌టీఐ చట్టం ఉద్దేశం దెబ్బతింటుందని, అన్ని రాష్ట్రాలూ వెంటనే ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది.
ఉస్మానియా యూనివర్సిటీలో వన్ టైం ఛాన్స్ ఫలితాల విడుదల
వన్ టైం ఛాన్స్ కింద జూన్‌లో నిర్వహించిన ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంఎఫ్‌సీ పరీక్షల ఫలితాలను అక్టోబరు 30న ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. పరీక్షలు రాసిన విద్యార్ధులు తమ మెమోలను పరీక్షల విభాగంలో తీసుకోవాలని అధికారులు సూచించారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.