IT Jobs: భారత ఐటీ రంగంలో ఊహించని పరిణామం.. 25 ఏళ్లలో తొలిసారి..
భారత్‌లోని 10 ప్రముఖ ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడింది. భారత్‌లోని ఐటీ కంపెనీలు దాదాపు 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. లైవ్‌మింట్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. జనవరి నుంచి సెప్టెంబర్ 2023 వరకు గడిచిన తొమ్మిది నెలల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల సంఖ్య తగ్గింది. ఐటీ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సెప్టెంబర్ నుంచి మార్చి వరకు సాధారణంగా ఐటీ రంగంలో తక్కువ పని కాలం ఉంటుంది. అయితే...

గత కొన్ని రోజులుగా ప్రపంచం ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటొంది. కరోనా మహమ్మారి, యుద్ధాల కారణంగా పలు దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. ప్రపంచంలోని చాలా దేశాలు మాంద్యంలో చిక్కుకున్నాయి. మాంద్యం ప్రభావం ఐటీ కంపెనీలపై తీవ్రంగా పడుతోంది. మరీ ముఖ్యంగా భారత ఐటీ రంగంపై ఈ మాంద్యం పెను ప్రభావాన్ని చూపుతుంది.
భారత్‌లోని 10 ప్రముఖ ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడింది. భారత్‌లోని ఐటీ కంపెనీలు దాదాపు 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. లైవ్‌మింట్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. జనవరి నుంచి సెప్టెంబర్ 2023 వరకు గడిచిన తొమ్మిది నెలల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల సంఖ్య తగ్గింది. ఐటీ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సెప్టెంబర్ నుంచి మార్చి వరకు సాధారణంగా ఐటీ రంగంలో తక్కువ పని కాలం ఉంటుంది. అయితే జనవరి నుంచి సెప్టెంబర్ వరకు భారతీయ ఐటీ రంగంలో మందగమనాన్ని సూచిస్తున్నాయి. తాజా గణంకాల ప్రకారం దేశంలోని 10 ప్రముఖ కంపెనీలు తమ వర్క్ ఫోర్స్‌ను తగ్గించుకున్నట్లు స్పష్టమవుతోంది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్ తదితర ప్రధాన ఐటీ కంపెనీలతో సహా పలు కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకున్నాయి. దేశంలోని టాప్ 10 ప్రముఖ ఐటీ కంపెనీలు ఈ ఏడాది ప్రారంభంలో 21.10 లక్షల మంది ఉద్యోగులను నియమించగా, సెప్టెంబర్ నాటికి 20.60 లక్షలకు తగ్గాయి. ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య ఇంతలా తగ్గడం గడిచిన 25 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇంత భారీ ఎత్తున ఉద్యోగులను తగ్గించడం పట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
మింట్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ లిమిటెడ్ వంటి ఐటీ కంపెనీలు గత 9 నెలల్లో 51,744 మంది ఉద్యోగులను తొలగించారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అమెరికాతో పాటు యూరప్‌లో మాంద్యం కారణంగా, భారతీయ ఐటీ రంగం కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నట్లు తేలింది.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..