Railway SECR Recruitment 2021: ఐటీఐ విద్యార్థులకు గుడ్ న్యూస్..! పరీక్ష లేకుండానే ఉద్యోగ అవకాశం..
Railway SECR Recruitment 2021: నిరుద్యోగ ఐటీఐ విద్యార్థులకు సువర్ణవకాశం. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు.
Railway SECR Recruitment 2021: నిరుద్యోగ ఐటీఐ విద్యార్థులకు సువర్ణవకాశం. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 432 పోస్టులు భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఒక్కసారి అధికారిక వెబ్‌సైట్ secr.indianrailways.gov.inని సందర్శించాలి. నోటిఫికేషన్ ప్రకారం.. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ 11 సెప్టెంబర్ 2021 నుంచి ప్రారంభమైంది. చివరితేది అక్టోబర్ 10 గా నిర్ణయించారు. ప్రత్యేక విషయం ఏమిటంటే ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ITI మెరిట్ ఆధారంగా జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు రైల్వే ప్రతి నెల స్టైఫండ్ కూడా ఇస్తుంది.
ముఖ్యమైన తేదీలు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ – 11 సెప్టెంబర్ 2021 దరఖాస్తుకు చివరి తేదీ – 10 అక్టోబర్ 2021 దరఖాస్తు రుసుము సమర్పించడానికి చివరి తేదీ – 10 అక్టోబర్ 2021 మెరిట్ జాబితా విడుదల తేదీ – ప్రకటించలేదు.
విద్యా అర్హత & వయోపరిమితి రైల్వే నోటిఫికేషన్ ప్రకారం.. అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇది కాకుండా వారు సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికేట్ కలిగి ఉండాలి. NCVT ద్వారా గుర్తింపు పొందిన సర్టిఫికెట్ పొంది ఉండాలి. అభ్యర్థుల కనీస వయస్సు 15 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 24 సంవత్సరాలు ఉండాలి. ITI మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఎంపిక ప్రక్రియకు సంబంధించిన సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌పై క్లిక్ చేయండి.
ఇలా అప్లై చేయండి ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి secr.indianrailways.gov.in లో సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసి పూర్తిగా చదవండి. ఇందులో దరఖాస్తు ప్రక్రియ గురించి ఖచ్చితమైన సమాచారం ఉంటుంది. దరఖాస్తు ఫారమ్ నింపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి తప్పులు చేయవద్దు.