AP EAPCET Results 2021: అగ్రికల్చర్, ఫార్మసీ ఫలితాలు విడుదల… రేపటి నుంచి ర్యాంక్‌కార్డ్ డౌన్ లోడ్ చేసుకునే అవకాశం..

AP EAPCET Results 2021 Audimulapu Suresh: ఆంధ్ర  ప్రదేశ్ లో  ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ ఈఏపీసెట్-2021) ఫలితాలు విడుదలయ్యాయి. మంగళ గిరి లోని ఉన్నత విద్యామండలి

AP EAPCET Results 2021:  అగ్రికల్చర్, ఫార్మసీ ఫలితాలు విడుదల... రేపటి నుంచి ర్యాంక్‌కార్డ్ డౌన్ లోడ్ చేసుకునే అవకాశం..
Ap Minister
Follow us
Surya Kala

| Edited By: Anil kumar poka

Updated on: Sep 14, 2021 | 3:49 PM

AP EAPCET Results 2021 Audimulapu Suresh: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ ఈఏపీసెట్-2021) ఫలితాలు విడుదలయ్యాయి. మంగళగిరి లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విద్యా శాఖ మంత్రి ఆదిములపు సురేష్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇప్పటికే ఇంజనీరింగ్  ఫలితాలను విడుదల చేయగా తాజాగా అగ్రికల్చర్ , ఫార్మసీ ఫలితాలను రిలీజ్ చేశారు.

అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాల్లో ప్రవేశానికి 83,822 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా 78,066 మంది పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. ఫలితాల్లో 72,488 (92.85 శాతం) మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి వివరించారు. ఈ ఫలితాల్లో 92.85 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాది 80.62 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఏపీసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల పరీక్షలు ఈ నెల 7వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. కంప్యూటర్‌ ఆధారిత విధానం ద్వారా మొత్తం 5 విడతలుగా ఈ పరీక్షలను నిర్వహించారు.

మొదటి ర్యాంక్ చందం విష్ణు వివేక్ (తూర్పుగోదావరి) సెకండ్ ర్యాంక్ రంగు శ్రీనివాస కార్తికేయ (అనంతపురం జిల్లా) థర్డ్ ర్యాంక్  బొల్లినేని విశ్వాసరావు (హనుమకొండ) లు సాధించారు.