School Education: కేంద్రం కీలక నిర్ణయం.. ‘రెండో తరగతి దాకా రాత పరీక్షలొద్దు’

పాఠశాల స్థాయిలో రెండో తరగతి వరకు రాత పరీక్షలను తొలగించాలని నేషనల్‌ కరికులమ్‌ ఫ్రేంవర్క్‌ (ఎన్‌సీఎఫ్‌) ముసాయిదా సిఫార్సు చేసింది. రాత పరీక్షతో కూడిన మూల్యాంకనం రెండో తరగతి దాకా విద్యార్థులకు ఒత్తిడితో కూడిన అదనపు భారంగా ఉంటుందని, అందువల్ల 3వ తరగతి నుంచి ఈ పరీక్షలు..

School Education: కేంద్రం కీలక నిర్ణయం.. 'రెండో తరగతి దాకా రాత పరీక్షలొద్దు'
School Education
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 09, 2023 | 11:04 AM

పాఠశాల స్థాయిలో రెండో తరగతి వరకు రాత పరీక్షలను తొలగించాలని నేషనల్‌ కరికులమ్‌ ఫ్రేంవర్క్‌ (ఎన్‌సీఎఫ్‌) ముసాయిదా సిఫార్సు చేసింది. రాత పరీక్షతో కూడిన మూల్యాంకనం రెండో తరగతి దాకా విద్యార్థులకు ఒత్తిడితో కూడిన అదనపు భారంగా ఉంటుందని, అందువల్ల 3వ తరగతి నుంచి ఈ పరీక్షలు నిర్వహించవచ్చని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ) పరిధిలో జాతీయస్థాయి సిలబస్‌పై ఈ ఫ్రేంవర్క్‌ కమిటీ కసరత్తు పూర్తిచేసింది. అంతేకాకుండా ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల మూల్యాంకనానికి రెండు విధానాలను కమిటీ సూచించింది. రికార్డింగు, డాక్యుమెంటేషను ద్వారా క్రమబద్ధమైన ఆధారాలు సేకరించి విద్యార్థుల ప్రగతి విశ్లేషణ జరగాలని తెల్పింది. ఇదంతా విద్యార్థుల అభ్యాస ప్రక్రియలో సహజసిద్ధమైన కొనసాగింపుగా చేయాలని వివరించారు. 3వ తరగతి నుంచి సన్నాహక దశగా పరిగణిస్తూ రాత పరీక్షలు నిర్వహించవచ్చని సిఫార్సు చేశారు. 6 నుంచి 8వ తరగతి వరకు పాఠ్యాంశాల దృష్టి భావనాత్మక అవగాహన, ఉన్నత శ్రేణి సామర్థ్యాల వైపు ఉండాలని తెలిపింది.

కాగా వచ్చేఏడాది నుంచి నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం పాఠ్యపుస్తకాలను ప్రవేశపెడతామని కేంద్ర విద్యా శాఖ అధికారులు తెలిపారు. అలాగే 11వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలను ఏడాదికి రెండు సార్లు నిర్వహించాలని సూచించింది. విద్యార్థులు ఈ రెండు పర్యాయాల్లో తమకు నచ్చిన సమయంలో పరీక్షలకు హాజరయ్యే వెసులుబాటు కూడా కల్పించాలని ప్రతిపాదించారు. ఈ మేరకు వచ్చే (2023-24) విద్యా సంవత్సరం నుంచి 9, 10, 11, 12 తరగతుల పరీక్షా విధానంలో మార్పులు చేస్తూ జాతీయ పాఠ్యాంశ ప్రణాళిక ముసాయిదాను రూపొందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..