NLC Recruitment: కేంద్ర ప్రభుత్వ సంస్థలో అప్రెంటిస్‌ పోస్టులు.. మార్కుల ఆధారంగానే ఎంపిక

నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ (ఎన్ఎల్‌సీ) ఇండియా లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. చెన్నై హెడ్‌ క్వార్టర్స్‌గా పనిచేసే ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌, టెక్నిషియన్‌, ఐటీఐ అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?

NLC Recruitment: కేంద్ర ప్రభుత్వ సంస్థలో అప్రెంటిస్‌ పోస్టులు.. మార్కుల ఆధారంగానే ఎంపిక
Nlc Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 27, 2023 | 5:14 PM

నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ (ఎన్ఎల్‌సీ) ఇండియా లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. చెన్నై హెడ్‌ క్వార్టర్స్‌గా పనిచేసే ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌, టెక్నిషియన్‌, ఐటీఐ అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 163 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో గ్రాడ్యుయేట్ /డిగ్రీ (ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్) అప్రెంటిస్ (35), టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ (42), ఐటీఐ అప్రెంటిస్ (86) పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఇంజనీరింగ్/టెక్నాలజీలో విగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ నాన్ ఇంజనీరింగ్ అప్రెంటిస్‌ పోస్టులకు ఎంబీఏ (హెచ్ఆర్) /ఎంఎస్‌డబ్ల్యూ/పీజీ డిప్లొమా (పర్సనల్ మేనేజ్‌మెంట్/పర్సనల్ మేనేజ్‌మెంట్ అండ్ ఇండస్ట్రియల్ పర్సన్) పూర్తి చేసి ఉండాలి. అలాగే టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ డిప్లొమా పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఇంజనీరింగ్‌/టెక్నాలజీలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. టెక్నీషియన్ అప్రెంటిస్ (డిప్లొమా) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారుడిప్లొమా (ఇంజనీరింగ్/టెక్నాలజీ) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఐటీఐ అప్రెంటిస్ పోస్టులకు ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.

* ఐటీఐ అప్రెంటిస్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయసు 14 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను సంబంధిత విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్‌ 30వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం క్లి్‌క్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తలకోసం క్లిక్ చేయండి..