NITI Aayog Consultant Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నీతి ఆయోగ్ (NITI Aayog).. ఒప్పంద ప్రాతిపదికన 28 కన్సల్టెంట్ గ్రేడ్-1, యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల (Consultant Grade I Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సైన్స్/ఎకనామిక్స్/స్టాటిస్టిక్స్/ఆపరేషన్ రిసెర్చ్/పబ్లిక్ పాలసీ/డెవలప్‌మెంట్ స్టడీస్/బిజినెస్ అడ్మిన్/మేనేజ్‌మెంట్ లేదా తత్సమాన విభాగాల్లో బీఈ/బీటెక్/ఎంబీబీఎస్/ఎల్‌ఎల్‌బీ/సీఏ/ఐసీడబ్ల్యూఏ/పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 32 నుంచి 45 ఏళ్లకు మించకుండా ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో నోటిఫికేషన్ విడుదలైన 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.70,000ల నుంచి రూ.1,45,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.