NEET UG 2023 Admit Card: నీట్ యూజీ హాల్ టికెట్లు విడుదల.. నేరుగా ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి..
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్- యూజీ 2023) పరీక్ష అడ్మిట్ కార్డులు గురువారం విడుదలయ్యాయి. మే 7న (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు జరిగే ఈ పరీక్షకు అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల..

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్- యూజీ 2023) పరీక్ష అడ్మిట్ కార్డులు గురువారం విడుదలయ్యాయి. మే 7న (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు జరిగే ఈ పరీక్షకు అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. పెన్ను, పేపర్ విధానంలో దేశవ్యాప్తంగా 499 నగరాలు/పట్టణాల్లో జరిగే ఈ పరీక్ష నిర్వహణకు ఎన్‌టీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పరీక్ష రాసే విద్యార్థులు అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేయడం ద్వారా లాగిన్ అయ్యి హాల్‌టికెట్లు పొందొచ్చు. తెలుగుతో పాటు 13 భాషల్లో జరిగే ఈ పరీక్ష జరగనుంది. గతేడాది 17.64లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా.. ఈ ఏడాది దాదాపు 20 లక్షల మంది రాసే అవకాశం ఉందని అంచనా. పరీక్ష రోజున అడ్మిట్ కార్డుతోపాటు ఫొటో ఐడెంటిటీ డాక్యుమెంట్‌లు, ఫొటోలను తీసుకొని పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. 2023-నీట్ యూజీ ప్రవేశ పరీక్ష కోసం ఈ ఏడాది తెలంగాణ నుంచి సుమారు 70 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. నీట్ వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా వైద్య విద్యా కాలేజీల్లో ఎంబీబీఎస్‌తో సహా 10 కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహించనున్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.