AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET PG 2025 Postponed: మెడికల్ విద్యార్ధులకు అలర్ట్.. నీట్ పీజీ పరీక్ష వాయిదా…! కారణం ఇదే

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వైద్య విద్యలో పీజీ ప్రవేశాల కోసం జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే నీట్ పీజీ పరీక్ష వాయిదా వేసింది. సింగిల్ షిఫ్ట్ లోనే పరీక్ష నిర్వహించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలే ఈ నిర్ణయానికి కారణమయ్యాయి. నీట్ పీజీ పరీక్ష జూన్ 15న జరగాల్సి ఉంది. అయితే ఎంబీబీఎస్ తో పాటు డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు రెండు షిఫ్ట్ లకు బదులుగా ఒకే షిఫ్ట్ లో పరీక్ష నిర్వహించాలని..

NEET PG 2025 Postponed: మెడికల్ విద్యార్ధులకు అలర్ట్.. నీట్ పీజీ పరీక్ష వాయిదా...! కారణం ఇదే
NEET PG Exam Postponed
Gopikrishna Meka
| Edited By: Srilakshmi C|

Updated on: Jun 02, 2025 | 9:12 PM

Share

హైదరాబాద్, జూన్ 2: దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పీజీ ప్రవేశాల కోసం జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే నీట్ పీజీ పరీక్ష వాయిదా వేసింది. సింగిల్ షిఫ్ట్ లోనే పరీక్ష నిర్వహించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలే ఈ నిర్ణయానికి కారణమయ్యాయి. నీట్ పీజీ పరీక్ష జూన్ 15న జరగాల్సి ఉంది. అయితే ఎంబీబీఎస్ తో పాటు డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు రెండు షిఫ్ట్ లకు బదులుగా ఒకే షిఫ్ట్ లో పరీక్ష నిర్వహించాలని దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ కు ఒకే షిప్ట్ లో పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది.

దీంతో ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సింగిల్ షిఫ్ట్ లో పరీక్ష నిర్వహణ సాధ్యం కాకపోవడంతో బోర్డు ఇవాళ కీలక నిర్ణయం ప్రకటించింది. సుప్రీంకోర్టు నిర్ణయం అమలు చేయాలంటే పలు మార్పులు చేయాల్సి ఉంటుందని ప్రకటన విడుదల చేసింది. పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచడం, అభ్యర్థులందరికీ ఒకేసారి వసతి కల్పించడానికి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వంటి అంశాలను పేర్కొంది. ఈమేరకు నీట్ పీజీ పరీక్ష పారదర్శకంగా జరిపేందుకు ఏర్పాట్లు చేసుకునేందుకు వీలుగా పరీక్షలు వాయిదా వేసినట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ తెలిపింది.

Neet Pg Exam

NEET PG exam

త్వరలోనే నీట్ పీజీ పరీక్షల కొత్త తేదీ వెల్లడిస్తామని పేర్కొంది.జాతీయ స్ధాయిలో నిర్వహిస్తున్న నీట్ పరీక్షల్లో అక్రమాలపై ఇప్పటికే విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పారదర్శకత ఉండాలంటే సింగిల్ షిఫ్ట్ లో పరీక్షలు నిర్వహిచాలని సుప్రీంకోర్టు సూచించింది. అలాగే సురక్షితమైన పరీక్షా కేంద్రాల్ని కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నీట్ పీజీ పరీక్షను ఒకే షిఫ్ట్ లో నిర్వహిస్తామని బోర్డు ప్రకటించింది. ఇందుకు అనుగుణంగానే ఇవాళ పీజీ పరీక్షల్ని వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.