AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NBCC Recruitment: ఎన్‌బీసీసీలో మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. మొదలైన దరఖాస్తుల స్వీకరణ..

NBCC Recruitment: నేషనల్‌ బిల్డింగ్స్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కార్పొరేషన్‌ లిమిటిడెట్‌ (NBCC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ నవరత్న కంపెనీ అయిన ఈ సంస్థ పలు విభాగాల్లో ఉన్న మేనేజర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?

NBCC Recruitment: ఎన్‌బీసీసీలో మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. మొదలైన దరఖాస్తుల స్వీకరణ..
Narender Vaitla
|

Updated on: May 10, 2022 | 3:50 PM

Share

NBCC Recruitment: నేషనల్‌ బిల్డింగ్స్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కార్పొరేషన్‌ లిమిటిడెట్‌ (NBCC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ నవరత్న కంపెనీ అయిన ఈ సంస్థ పలు విభాగాల్లో ఉన్న మేనేజర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 23 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో జనరల్‌ మేనేజర్‌ (ఇంజనీరింగ్) 06, అడిషనల్ జనరల్‌ మేనేజర్‌ (మార్కెటింగ్‌) 02, ప్రాజెక్ట్‌ మేనేజర్‌ (సివిల్‌) 15 ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* జనరల్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సివిల్‌ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం 15 ఏళ్ల అనుభవం ఉండాలి.

* అడిషనల్ జనలర్‌ మేనేజర్‌ (మార్కెటింగ్‌) పోస్టులకు అప్లై చేసుకునే వారు ఎంబీఏ/పోస్ట్‌ గ్రాడ్యయేషన్‌ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో 12 ఏళ్ల అనుభవం ఉండాలి.

* ప్రాజెక్ట్‌ మేనేజర్‌ (సివిల్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సివిల్‌ ఇంజనీరింగ్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో 6 ఏళ్ల అనుభవం ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను మొదట పని అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అంనతరం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* మే 9న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ జూన్‌ 8తో ముగియనుంది.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!