NRIDA Recruitment 2021: భారత ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌లో (ఎన్ఆర్‌డీఏ) ఉద్యోగాల భర్తీ చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి గత కొన్ని రోజుల క్రితమే నోటిఫికేషన్ విడుదల చేశారు. న్యూఢిల్లీలో ఉన్న ఎన్ఆర్‌డీఏలో ఈ ఖాళీలను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు మరో రెండు రోజుల్లో (18-06-2021) గడువు ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు..
* మొత్తం 19 పోస్టులకు గాను.. అసిస్టెంట్ డైరెక్టర్ (02), సీనియర్ కన్సల్టెంట్ (02), కన్సల్టెంట్ రాజభాషా (01), ఇంటర్న్ షిప్ (13) ఖాళీలను భర్తీచేయనున్నారు.
* అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 3 ఏళ్ల అనుభవం ఉండాలి.
* సీనియర్ కన్సల్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు.. డిగ్రీ(సివిల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో కనీసం 2 ఏళ్ల అనుభవం ఉండాలి.
* ఇంటర్న్‌షిప్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు గ్రాడ్యుయేషన్/పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
* అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులు తమ వివరాలను nridavacancies@gmail.com మెయిల్‌కు పంపించాలి.
* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 18-06-2021ని నిర్ణయించారు.
* పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
Haj 2021: కరోనా కారణంగా ఈ ఏడాది హజ్ యాత్ర దరఖాస్తులన్నీ రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం