AP Jobs: నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు.. కూటమి సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు
ఎన్డీఏ కూటమి సర్కార్ నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి వెల్లడించారు. ఇందుకోసం గుంటూరు జిల్లాలో నాలుగు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టామన్నారు. దాదాపు 26 కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నట్లు తెలిపారు. ప్రతి నిరుద్యోగి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కంపెనీలు జాబ్ మేళాలో చెప్పిన ప్యాకేజీ ఒకటి జాయిన్..

అమరావతి, జులై 22: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి, మెప్మా పీడి దుర్గా భాయ్, మాస్టర్ మైండ్స్ అధినేత మట్టుపల్లి మోహన్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన కోసం మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసామన్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 1400 మంది యువత ఈ జాబ్ మేళాలో పాల్గొన్నారని తెలిపారు. ఎన్డీఏ కూటమి నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుందని వెల్లడించారు.
ఇందుకోసం గుంటూరు జిల్లాలో నాలుగు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టామన్నారు. దాదాపు 26 కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నట్లు తెలిపారు. ప్రతి నిరుద్యోగి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కంపెనీలు జాబ్ మేళాలో చెప్పిన ప్యాకేజీ ఒకటి జాయిన్ అయినప్పుడు మరో ప్యాకేజీ చెపుతున్నారని నా దృష్టికి వచ్చిందని, కంపెనీల ప్రతినిధులు ఎవరూ అలాంటి విధానం పాటించవద్దని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి సూచించారు.
ఆంధ్రప్రేదశ్‌లోని ఎస్సీ, ఎస్టీ యువతకు పోటీ పరీక్షలపై శిక్షణ
రాష్ట్రంలోని నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ యువతకు అంబేడ్కర్ స్టడీ సర్కిళ్ల ద్వారా పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడ, విశాఖ, తిరుపతి కేంద్రాల్లో శిక్షణ ఉంటుందని అన్నారు. అంబేడ్కర్ స్టడీ సర్కిళ్లలో.. వివిధ బ్యాంకుల పీవో పోస్టులకు, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌ఏ), రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తామని అన్నారు. అభ్యర్థుల నుంచి త్వరలోనే దరఖాస్తుల స్వీకరణ చేపడతామని ఆయన తెలిపారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




