AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech Layoffs: కొనసాగుతోన్న ఉద్యోగుల ఊస్టింగ్‌.. భారీగా ఉద్యోగులను ఇంటికి పంపుతోన్న మరో బడా కంపెనీ.

ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపు కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయ దిగ్గ సంస్థలైన గూగుల్‌, ట్విట్టర్‌, మెటా, మైక్రోసాఫ్ట్, ఐబీఎమ్‌ వంటి సంస్థలు ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించాయి. ఎప్పుడు కంపెనీ పింక్‌ స్లిప్‌ పంపిస్తుందన్న ఆందోళనలో ఉన్నారు ఉద్యోగులు. బడా కంపెనీల పరిస్థితే ఇలా ఉంటే ఇక కొన్ని..

Tech Layoffs: కొనసాగుతోన్న ఉద్యోగుల ఊస్టింగ్‌.. భారీగా ఉద్యోగులను ఇంటికి పంపుతోన్న మరో బడా కంపెనీ.
Layoff
Narender Vaitla
|

Updated on: Jan 31, 2023 | 5:45 PM

Share

ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపు కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయ దిగ్గ సంస్థలైన గూగుల్‌, ట్విట్టర్‌, మెటా, మైక్రోసాఫ్ట్, ఐబీఎమ్‌ వంటి సంస్థలు ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించాయి. ఎప్పుడు కంపెనీ పింక్‌ స్లిప్‌ పంపిస్తుందన్న ఆందోళనలో ఉన్నారు ఉద్యోగులు. బడా కంపెనీల పరిస్థితే ఇలా ఉంటే ఇక కొన్ని స్టార్టప్‌లైతే ఏకంగా మూతపడే స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం తప్పదన్న వార్తల నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపు ఇప్పుడు భయపెడుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో కంపెనీ ఉద్యోగులను ఇంటికి సాగనంపుతోంది.

ఆన్‌లైన్‌లో సెకండ్ హ్యాండ్‌ వస్తువుల అమ్మకాలు, కొనుగోలు చేసే ఓలెక్స్‌ ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగుల్లో 15 శాతం తొలగించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఓఎల్‌ఎక్స్‌లో మొత్తం 10000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా వీరిలో సుమారు 1500 మందిని తొలగించనున్నారు. వీరిలో భారతీయ ఉద్యోగులు సైతం ఉన్నారు.

రానున్న రోజుల్లో మాంద్యం తప్పదన్న కారణంతోనే ఓఎల్‌ఎక్స్‌ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఓఎల్‌ఎక్స్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో ముఖ్యంగా ఇంజినీరింగ్‌, ఆపరేషన్స్‌ టీమ్‌లో పనిచేసే ఉద్యోగులపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఖర్చులు తగ్గించుకునేందుకే కంపెనీ ఉద్యోగులను తొలగించినట్లు సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. 2009లో భారత్‌లో ప్రారంభమైన ఓఎల్‌ఎక్స్‌ అనతి కాలంలోనే మంచి లాభాలను ఆర్జించింది. 2020లో ఓఎల్‌ఎక్స్‌ ఆటో పేరిట కార్ల అమ్మకాల వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఓఎల్‌ఎక్స్‌ ఈ స్థాయిలో ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇదిలా ఉంటే రానున్న ఆరు నెలల్లో మాంద్యం ప్రభావం మరింత తీవ్రంగా ఉండనుందన్న వార్తల నేపథ్యంలో ఇంకెంత మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందోనన్న ఆందోళనలు పెరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
దంచి కొట్టే వానల్లో కారం కారంగా కాలీఫ్లవర్ 65..ఇలా చేస్తే అదుర్స్
దంచి కొట్టే వానల్లో కారం కారంగా కాలీఫ్లవర్ 65..ఇలా చేస్తే అదుర్స్
జర్నీలో పగిలిన రూ.35 వేల మద్యం బాటిల్.. వినియోగదారుల కమిషన్ షాక్
జర్నీలో పగిలిన రూ.35 వేల మద్యం బాటిల్.. వినియోగదారుల కమిషన్ షాక్
క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కాండల్స్
క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కాండల్స్
ట్రంప్ కుటుంబమే టార్గెట్! అమెరికాలో టెన్షన్..!
ట్రంప్ కుటుంబమే టార్గెట్! అమెరికాలో టెన్షన్..!
బరువు తగ్గాలంటే అన్నం బంద్ చేయాలా?.. డాక్టర్స్ సీక్రెట్
బరువు తగ్గాలంటే అన్నం బంద్ చేయాలా?.. డాక్టర్స్ సీక్రెట్
పూజ సమయంలో సాంప్రదాయ దుస్తులే ధరించాలా? శాస్త్రాలు చెప్పిన అసలు..
పూజ సమయంలో సాంప్రదాయ దుస్తులే ధరించాలా? శాస్త్రాలు చెప్పిన అసలు..
మహిళల ఖాతాల్లో ఏటా రూ.30,000.. ఆగస్టు 1 నుంచి దరఖాస్తులు షురూ..!
మహిళల ఖాతాల్లో ఏటా రూ.30,000.. ఆగస్టు 1 నుంచి దరఖాస్తులు షురూ..!
అప్పట్లో కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. వ్యభిచార కేసుతో కెరీర్ క్లోజ్..
అప్పట్లో కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. వ్యభిచార కేసుతో కెరీర్ క్లోజ్..
జ్వరం ఉన్నప్పుడు స్నానం చేయవచ్చా? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే..
జ్వరం ఉన్నప్పుడు స్నానం చేయవచ్చా? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే..
విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు గుడ్‌బై.. విమాన సేవలు కట్!
విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు గుడ్‌బై.. విమాన సేవలు కట్!