Telangana: ఇష్టారాజ్యంగా లా కోర్సుల ఫీజులు పెంచిన వర్సిటీలు.. ఆందోళన చెందుతున్న విద్యార్ధులు..

|

Nov 27, 2022 | 3:35 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు లా యూనివర్సిటీల్లో భారీగా ఫీజులు పెరిగాయి. ఉస్మానియా, కాకతీయ తదితర యూనివర్సిటీల్లో లా కోర్సుల ఫీజులు దాదాపు మూడు, నాలుగింతలు..

Telangana: ఇష్టారాజ్యంగా లా కోర్సుల ఫీజులు పెంచిన వర్సిటీలు.. ఆందోళన చెందుతున్న విద్యార్ధులు..
Telangana Law Universities increases Law fee
Follow us on

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు లా యూనివర్సిటీల్లో భారీగా ఫీజులు పెరిగాయి. ఉస్మానియా, కాకతీయ తదితర యూనివర్సిటీల్లో లా కోర్సుల ఫీజులు దాదాపు మూడు, నాలుగింతలు పెంచేశారు. వాటిల్లో రెగ్యులర్‌ కోర్సులతో పాటు సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కింద నడిచే యూనివర్సిటీల్లో కూడా ఫీజులు పెరిగిపోయాయి. ఫీజులు పెంచుతున్నట్లు కనీసం ఎటువంటి ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా ఆయా లా యూనివర్సిటీలు తమ వెబ్‌సైట్‌లలో పెంచిన ఫీజుల వివరాలను నమోదు చేశాయి.

ఇక ఇప్పటికే లాసెట్‌-2022 కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తయ్యి.. క్లాసులు కూడా రేపట్నుంచి (నవంబర్‌ 28) ప్రారంభమవుతున్నాయి. ఇక ఇప్పుడు అడ్మిషన్లు పొందిన విద్యార్ధులందరూ కొత్త ఫీజులను తెలుసుకొని షాకవుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ రెగ్యులర్‌ కోర్సుకు రూ.5,460ల పీజు ఉండగా.. అది ఇపుడు ఏకంగా రూ.16,000లకు పెంచారు. ఎల్‌ఎల్‌ఎం ఫీజు రూ.4,500ల నుంచి రూ.20,100లకు పెంచారు. కాకతీయ యూనివర్సిటీలో కూడా కాస్త అటుఇటుగా అదే స్థాయిలో ఫీజులు పెరిగాయి. దీంతో విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు. తీసుకున్న సీటు వదులుకోలేక, పెరిగిన ఫీజు చెల్లించలేక నానాఅవస్థలు పడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.