AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KNRUHS Admission 2024: కాళోజీ హెల్త్‌ వర్సిటీలో బీపీటీ, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల.. చివరి తేదీ ఇదే

కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.. 2024-25 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అసక్తి కలిగిన వారు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.. పూర్తి వివరాలు ఈ కింద తెలుసుకోండి.

KNRUHS Admission 2024: కాళోజీ హెల్త్‌ వర్సిటీలో బీపీటీ, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల.. చివరి తేదీ ఇదే
KNRUHS Admissions
Srilakshmi C
|

Updated on: Oct 31, 2024 | 9:42 AM

Share

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.. 2024-25 విద్యా సంవత్సరానికి బీపీటీ, బీఎస్సీ అనుబంధ హెల్త్‌ సైన్సెస్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు గానూ అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ప్రవేశాల ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వర్సిటీ అనుబంధ ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. అక్టోబరు 28వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. నవంబరు 6వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు కొనసాగుతాయి. ధ్రువ పత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్‌ జాబితాను విడుదల చేస్తారు. ఈ మేరకు వర్సిటీ తన ప్రకటనలో వివరించింది.

కాళోజీ హెల్త్‌ వర్సిటీ కోర్సు వివరాలు

  • బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ
  • బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ
  • బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ
  • బీఎస్సీ కార్డియాక్ అండ్‌ కార్డియో వాస్కులర్ టెక్నాలజీ
  • బీఎస్సీ రెనల్‌ డయాలసిస్ టెక్నాలజీ
  • బీఎస్సీ ఆప్టోమెట్రీ
  • బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ
  • బీఎస్సీ న్యూరో సైన్స్ టెక్నాలజీ
  • బీఎస్సీ క్రిటికల్ కేర్ టెక్నాలజీ
  • బీఎస్సీ రేడియాలజీ అండ్‌ ఇమేజింగ్ టెక్నాలజీ
  • బీఎస్సీ అడియాలజీ అండ్‌ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ
  • బీఎస్సీ మెడికల్ రికార్డ్స్ సైన్సెస్
  • బీఎస్సీ న్యూక్లియర్ మెడిసిన్
  • బీఎస్సీ రేడియో థెరపీ టెక్నాలజీ
  • బీపీటీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ)

బీఎస్సీ ఎంఎల్‌టీ కోర్సుకు మూడేళ్లు, బీపీటీకి నాలుగేళ్లు, మిగిలిన కోర్సులకు నాలుగేళ్ల చొప్పున వ్యవధి ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ లేదా ఇంటర్‌ ఒకేషనల్‌ బ్రిడ్జ్ కోర్సు లేదా ఫిజికల్ సైన్సెస్/ బయోలాజికల్ సైన్సెస్‌ సబ్జెక్టులతో సార్వత్రిక విద్యలో ఇంటర్‌లో ఉత్తీర్ణులై వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్థుల వయసు డిసెంబర్ 31, 2024 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు నవంబర్‌ 6, 2024వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. దరఖాస్తు రుసుము కింద ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.2500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.2000 చెల్లించవల్సి ఉంటుంది. ఎలాంటి ప్రవేశ పరీక్ష నిర్వహించకుండా ఇంటర్ మార్కులు, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.