Telangana: తెలంగాణలోని వైద్యారోగ్య అధికారి ఆఫీస్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే.
ఖమ్మంలోని జిల్లా వైద్యారోగ్య అధికారి ఆఫీసులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్‌లో భాగంగా కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?
ఖమ్మంలోని జిల్లా వైద్యారోగ్య అధికారి ఆఫీసులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్‌లో భాగంగా కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 19 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ఏఎన్‌ఎం (01), పీడియాట్రిషియన్ (01), సైకాలజిస్ట్ (01), మెడికల్ ఆఫీసర్ (05), మేనేజర్ (01), ఫార్మసిస్ట్ గ్రేడ్-2 (01), ఆడియాలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్ (01), ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్ (01), అకౌంటెంట్ కమ్ డీఈవో (03), బయోకెమిస్ట్ (01), డేటా ఎంట్రీ ఆపరేటర్ (03) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు ధరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, డీఫార్మసీ, బీపీటీ, బీకాం, డిగ్రీ, ఎంబీబీఎస్, ఎండీ, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
* అభ్యర్థుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను నేరుగా ఖమ్మంలోనే డీఎంహెచ్‌వో కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు 13-03-2023ని చివరి తేదీగా నిర్ణయించారు. ఉద్యోగుల తుది ఎంపిక 21-03-2023, నియామక ఉత్తర్వుల జారీ 22-03-2023న ఉండనుంది.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..