JEE Results: జేఈఈ మెయిన్‌ పరీక్షా ఫలితాలు వచ్చేశాయ్‌.. ఎలా చెక్‌ చేసుకోవాలంటే.

దేశంలోని పలు ప్రతిష్టాత్మక సాంకేతిక విద్య సంస్థల్లో ఇంజనీరింగ్‌ ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్‌ పరీక్షా ఫలితాలు వచ్చేశాయ్‌. సెషన్‌-1 పరీక్షా ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాల కోసం...

JEE Results: జేఈఈ మెయిన్‌ పరీక్షా ఫలితాలు వచ్చేశాయ్‌.. ఎలా చెక్‌ చేసుకోవాలంటే.
AP Inter Results
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 07, 2023 | 3:55 PM

దేశంలోని పలు ప్రతిష్టాత్మక సాంకేతిక విద్య సంస్థల్లో ఇంజనీరింగ్‌ ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్‌ పరీక్షా ఫలితాలు వచ్చేశాయ్‌. సెషన్‌-1 పరీక్షా ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు తెలిపారు. ఈ వెబ్‌సైట్‌లో అర్హత సాధించిన విద్యార్థుల జాబితాను ఉంచారు. అప్లికేషన్‌ నెంబర్‌, డేట్‌ ఆఫ్‌ బర్త్‌ వంటి వివరాలను ఎంటర్‌ చేయడం ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.

జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీవరకు జరిగిన ఈ పరీక్షలకు సుమారు 9 లక్షల మందికిపైగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్న విషయం తెలిసిందే. వీరిలో పేపర్‌–1 (బీఈ, బీటెక్‌) పరీక్షకు 8.22 లక్షల మంది, పేపర్‌–2 (బీఆర్క్, బీప్లానింగ్‌) పరీక్షకు 46 వేల మంది హాజరయ్యారని ఎన్‌టీఏ తెలిపింది. జేఈఈ పరీక్షకు సుమారు 95.8 శాతం మంది హాజరు కావడం ఇదే తొలిసారని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ తెలిపింది.

ఇక జేఈఈ మెయిన్‌ తొలి సెషన్‌ పరీక్షల ప్రాథమిక కీని ఫిబ్రవరి 1వ తేదీన విడుదల చేసిన అధికారులు, ఫిబ్రవరి 2 నుంచి 4వ తేదీవరకు అభ్యర్థుల అభ్యంతరాలను స్వీకరించారు. ఇక రెండో విడుత పరీక్షలు నిర్వహించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్‌టీఏ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 6 నుంచి 12వ తేదీ వరకు జేఈఈ మెయిన్‌ రెండోవిడత పరీక్షలు నిర్వహించనున్నారు.ఈ పరీక్షలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఫిబ్రవ‌రి 7వ తేదీన ప్రారంభమై.. మార్చి 7వ తేదీవరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. సెకండ్‌ సెషన్‌కు సంబంధించిన అప్లికేషన్‌ ఫారం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని ఎన్‌టీఏ తెలిపింది.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..