JEE Mains Scam: జేఈఈ మెయిన్‌లో అవకతవకలు.. 20 మంది విద్యార్థులను డిబార్ చేసిన ఎన్‌టీఏ
JEE Mains Scam: దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జేఈఈ మెయిన్స్‌లో అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. ఈ అవకతవకలకు సంబంధించి 20 మంది..
JEE Mains Scam: దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జేఈఈ మెయిన్స్‌లో అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. ఈ అవకతవకలకు సంబంధించి 20 మంది విద్యార్థులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) డిబార్ చేసినట్లు తెలిపింది. తప్పుడు మార్గంలో పరీక్ష రాసేందుకు ప్రయత్నించినందుకు 20 మంది విద్యార్థులను మూడేళ్ల పాటు హాజరు కాకుండా డిబార్ చేసినట్టు ఎన్‌టీఏ ఒక ప్రకటనలో వెల్లడించింది. తప్పుడు మార్గంలో పరీక్ష రాసేందుకు అభ్యర్థులు రూ.15 లక్షలు చెల్లించినట్టు గుర్తించారు. హర్యానాలోని సోనిపత్‌లోని ఒక పరీక్షా కేంద్రం కోచింగ్ సెంటర్ – అఫినిటీ ఎడ్యుకేషన్ ద్వారా హ్యక్ చేయబడట్టు అధికారులు గుర్తించారు. రిమోట్ ఆక్సిస్ ద్వారా చీటింగ్ విద్యార్థులునిర్వాహకులు విద్యార్థులకు సహకరించారు. జేఈఈ అవకతకలపై సీబీఐ ఢిల్లీ, ఇండోర్, పుణె, బెంగళూరు, జంషెడ్‌పూర్‌లలో తనిఖీలు చేపట్టింది. ఢిల్లీ, పుణె, జంషెడ్‌పూర్, ఇండోర్, బెంగళూర్‌ల్లోని 20 చోట్ల సీబీఐ అధికారులు దాడులు చేశారు. ఇందులో వారికి 25 లాప్‌టాప్‌లు, 7 పర్సనల్ కంప్యూటర్లు, 30 పోస్ట్ డేటెడ్ చెక్‌లు, వివిధ విద్యార్థుల పీడీసీ మార్క్‌షీట్స్ పలు ఆధారాలను స్వాధీనం చేసుకొన్నారు అధికారులు. ఈ స్కామ్‌తో ఇంకా ఎంత మందికి సంబంధం ఉందని పూర్తిగా తేలాల్సి ఉంది. దీనిపై మరింతగా విచారణ జరుపుతున్నారు.
కాగా, అఫినిటీ ఎడ్యుకేషన్‌కు చెందిన ఇద్దరు డైరెక్టర్లను గతంలో సీబీఐ అరెస్టు చేసింది. తరువాత, ఇది సోనీపట్‌లోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న.. అఫినిటీ ఎడ్యుకేషన్‌తో సంబంధం ఉన్న ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు ప్యూన్‌తో సహా మరో ఏడుగురిని సీబీఐ అరెస్టు చేసింది.
దర్యాప్తు జరిపి మళ్లీ పరీక్ష పెట్టాలి..
ఈ పరీక్షపై దర్యాప్తు జరిపి మళ్లీ పరీక్ష పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు పలువురు విద్యార్థులు. కేవలం జేఈఈ మెయిన్ మాత్రమే కాదు, నీట్ 2021 లో పేపర్ లీక్ జరిగిందని వారు ఆరోపించారు. జీఈఈ మెయిన్ గతంలో సీబీఎస్ఈ ద్వారా నిర్వహించబడింది. ప్రస్తుతం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ద్వారా నిర్వహించబడుతుంది. పరీక్షలను మరింత శాస్త్రీయంగా, పారదర్శకంగా నిర్వహించడానికి ఎన్‌టీఏ ఏర్పాటు చేసి. ప్రతి ఏడాది దాదాపు 10 లక్షల మంది అభ్యర్థులు జేఈఈ మెయిన్ కోసం హాజరవుతారు. అవకతవకలు జరిగినట్లు బయటపడటంతో అధికారులు మరింత లోతుగా విచారణ చేపడుతున్నారు.