ITBP Constable PET: ఐటీబీపీ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు షురూ.. త్వరలోనే రాత పరీక్ష తేదీలు వెల్లడి

|

Jan 15, 2025 | 3:04 PM

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) కానిస్టేబుల్‌ నియామకాలకు సంబంధించి కీలక అప్‌డేట్‌ వెలువడింది. ఇటీవల విడుదలైన కానిస్టేబుల్ (పైనీర్‌) పోస్టుల భర్తీకి సంబంధించిన ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌లు త్వరలోనే జరగనున్నాయి. తాజాగా ఈ రెండు టెస్ట్‌లకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి..

ITBP Constable PET: ఐటీబీపీ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు షురూ.. త్వరలోనే రాత పరీక్ష తేదీలు వెల్లడి
ITBP Constable PET Events
Follow us on

కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలోని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) వివిధ విభాగాల్లో కానిస్టేబుల్ (పైనీర్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 202 పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే తాజాగా కానిస్టేబుల్ పయనీర్ పోస్ట్‌ల ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)లకు సంబంధించి అడ్మిట్ కార్డ్‌లను విడుదల చేసింది. పదో తరగతి అర్హత కలిగిన పురుష, మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు పోటీ పడవచ్చు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనంతరం రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలోనే వెల్లడిస్తామని ITBP వెల్లడించింది. ఇందులో ప్రతిభకనబరచిన వారిని ఎంపిక చేస్తారు.

కాగా ITBP కానిస్టేబుల్ పయనీర్ పోస్ట్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం గత ఏడాది 12 ఆగస్టు 2024 నుంచి 10 సెప్టెంబర్ 2024 వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరించారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఐటీబీపీ కానిస్టేబుల్ ఈవెంట్స్‌ అడ్మిట్‌కార్డుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

రాత పరీక్ష విధానం ఎలా ఉంటుందంటే..

మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులకు గానూ ఆబ్జెక్టివ్‌ టైప్‌ పద్ధతిలో ప్రశ్నాపత్రం ఉంటుంది. జనరల్ ఇంగ్లిష్ విభాగం నుంచి 20 ప్రశ్నలకు 20 మార్కులు, జనరల్ హిందీ విభాగం నుంచి 20 ప్రశ్నలకు 20 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ విభాగం నుంచి 20 ప్రశ్నలకు 20 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ విభాగం నుంచి 20 ప్రశ్నలకు 20 మార్కులు, సింపుల్ రీజనింగ్ విభాగం నుంచి 20 ప్రశ్నలకు 20 మార్కులు కేటాయిస్తారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.